telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

నాలుగు సార్లు ఎమ్మెల్యే అయిన కాలినడకనే ప్రయాణం…

మాములుగా ఇప్పుడున్న సమాజంలో ఒక్కసారి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే అతని జీవితం మారిపోతుంది.  డబ్బు, హోదా, పదవి అన్ని వాటంతట అవే వస్తుంటాయి.  అయితే, అయన నాలుగుసార్లు శాసనసభకు ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు.  ఇప్పటికే తన సొంతం అనుకునే ఇల్లు లేదు.  ఎక్కడికి వెళ్లినా కాలినడకనే నడిచి వెళ్తుంటాడు.  చదివింది పదో తరగతే… ప్రజాసమస్యలపై మాత్రం  డాక్టరేట్ చేశారు.  నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పనిచేస్తూ ఉంటారు.  అయన పేరు మహబూబ్ ఆలమ్.  సీపీఐ తరపున పోటీ చేసి విజయం సాధించారు.  ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల్లో అయన కతిహార్ జిల్లా బలరామ్ పూర్ నియోజక వర్గం నుంచి పోటీచేసి నాలుగోసారి ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు.  వికాస్ షీల్ ఇన్సాన్ పార్టీ అభ్యర్థి వీరేంద్ర కుమార్ ఓజాపై 53 వేల ఓట్ల తేడాతో మహబూబ్ ఆలమ్ విజయం సాధించారు.  ఈ ఎన్నికల్లో బీహార్లో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన వ్యక్తిగా మహబూబ్ ఆలమ్ రికార్డ్ సాధించారు.  ఎన్నికల అఫిడవిట్ లో ఎలాంటి ఆస్తులు లేవని మహబూబ్ ఆలం పేర్కొన్నారు.  దీంతో అయన గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.

Related posts