పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లపై మ్యాపింగ్ చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. పులివెందుల అభివృద్ధిపై ఆయన గురువారం సమీక్ష నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, పలు శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా శాఖల వారీగా చేపడుతున్న పనులను సీఎం వైఎస్ జగన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే విద్యా సంస్థలు, వైద్య సంస్థలు, ఇరిగేషన్ పనులకు సన్నద్ధవవుతున్నామని అధికారులు ఆయనకు తెలిపారు. అలాగే క్యాన్సర్ ఆస్పత్రి, ఇటీవల చేసిన శంకుస్థాపనలకు సంబంధించిన పనులపై సీఎం సమీక్ష నిర్వహించారు.
బందర్ పోర్టుని తెలంగాణకు ఎంతకు అమ్మేశారు: ప్రశ్నించిన దేవిదేని