telugu navyamedia
YCP ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్‌పై వైసీపీ కార్యకర్తల దాడి: విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న మూకలు

ఏపీలో వైసీపీ మూకలు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నాయి. విచ్చలవిడిగా దాడులకు తెగబడుతున్నాయి. అధికారం కోల్పోయినా కూడా వైసీపీ శ్రేణులు దాడి సంస్కృతిని కొనసాగిస్తునే ఉన్నాయి.

అందుకు సాక్ష్యమే ఈ ఘటన. విధి నిర్వహణలో భాగంగా ఫొటోలు తీస్తున్న ఆంధ్రజ్యోతి ఫొటో గ్రాఫర్ శివకుమార్‌పై దాడి చేశారు వైసీపీ కార్యకర్తలు.

అసలేం జరిగిందంటే..బంగారుపాలెం జగన్ పర్యటనలో వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. జగన్ అక్కడి రైతులతో మాట్లాడే ఫొటోలను తీస్తున్న ఆంధ్రజ్యోతి చిత్తూరు డిప్యూటీ చీఫ్ ఫోటోగ్రాఫర్ శివ కుమార్‌పై దాడి చేశారు.

సుమారు పది మంది చుట్టు ముట్టి అతడి చొక్కా చించేసి మరీ విచక్షణారహితంగా కొట్టారు. ఉదయం నుంచీ తీసిన ప్రోగ్రాం ఫోటోలు ఉండే మెమరీ కార్డు లాక్కున్నారు.

మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సైగ చేయడంతో దాడులకు తెగబడ్డారు. చిత్తూరు వైసీపీ ఇంచార్జి విజయానంద రెడ్డి చూస్తుండగానే ఈ దాడి జరిగింది.

మెమరీ కార్డు.. విజయనంద రెడ్డి అనుచరుడు చక్రి తీసుకున్నారు. ఫొటో గ్రాఫర్‌పై దాడి చేసిన వైసీపీ మూకలు, జగన్ పర్యటనలో పోలీసులపై కూడా దౌర్జన్యం చేశారు.

మమ్మల్ని అనుమతించకుంటే రప్పా రప్పా అంటూ బెదిరింపులకు దిగారు.

Related posts