ఏపీ మంత్రి నారా లోకేష్ పై మంగళగిరి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శనస్త్రాలు సంధించారు. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన శుక్రవారం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో నామినేషనల్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మంగళగిరిలో తనకు సరైన పోటీ లోకేష్ కానేకాదనన్నారు. అసలైన పోటీ వాళ్ల తండ్రి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడని ఆర్కే పేర్కొన్నారు.
లోకేష్ పీడ వదిలించుకోవడానికే చంద్రబాబు తనపై పోటీకి పంపారని ఎద్దేవా చేశారు. లోకేష్ కు పీజ్జా బర్గర్ లు తినడం తప్ప కాడి తెలుసా, మేడి తెలుసా అంటూ దుయ్యబట్టారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ప్రజలకిచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఓట్లను అడుగుతున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ ఆశీర్వాదంతో ఈ నియోజకవర్గంలో మరోసారి వైసీపీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు.


బురద చల్లేందుకు కేసీఆర్ సిద్ధం: జేసీ దివాకర్ రెడ్డి