telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జగన్ మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి: షర్మిల

దేశరాజధానిలో తన ధర్నాకు కాంగ్రెస్ ఎందుకు సంఘీభావం ప్రకటించలేదన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఎక్స్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుకా..? వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుకా?

బీజేపితో  సంబందం పెట్టుకుని, విభజన హక్కులను, ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టి,  ఆఖరుకి మణిపూర్ ఘటనపై నోరెత్తని మీకు ఉన్నట్లుండి అక్కడి పరిస్థితులు గుర్తుకు రావడం విడ్డూరం.

మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం చేస్తుంటే మీనుంచి వచ్చిందా సంఘీభావం?

మీ నిరసనలో నిజం లేదని, స్వలాభం తప్పా రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని తెలిసే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది.

సిద్దం అన్న వాళ్లకు 11మంది భలం సరిపోలేదా ఇప్పుడు కలిసి పోరాడుదాం అంటున్నారు?  అని  ట్వీట్ చేసారు.

Related posts