జగన్ హయాంలో మద్యం స్కామ్ పై విచారణ జరుగుతోంది . మద్యం మాఫియాపై రోజూ థ్రిల్లర్ సిరీస్ లో కథనాలు, సీఎంగా చేసిన జగన్ పోలీసుల బట్టలూడదీస్తామనడం బాగోలేదు అని షర్మిల అన్నారు.
జగన్ హయాంలో పోలీసులను ఎలా వాడుకున్నారో అందరికి తెలుసు. తనకు వ్యతిరేకంగా ఉన్న నేతల వేధింపులకు పోలీసులను జగన్ వాడుకున్నారు.
రఘురామ సహా పలువురి నేతలను ఎలా వేధించారో అందరికి తెలుసు.
జగన్ హయాంలో జత్వానీ కేసులో పోలీసుల తీరు దారుణం. పోలీసులను తక్కువ చేసి మాట్లాడటం జగన్ కు తగదు అన్నారు.
తన తప్పుంటే విచారణ చేసుకోవాలని వైఎస్ఆర్ చెప్పేవారు. విచారణ చేసుకోవాలని చెప్పట్లేదంటే జగన్ దోషి అని తెలుస్తోంది.
విచారణ చేయాలని ఎందుకు చెప్పట్లేదు, వైఎస్ఆర్ మాదిరిగా తప్పుంటే ఉరి తీయాలని ఎందుకు చెప్పట్లేదు.
తన వెనుక ఉన్నది మచ్చలేని వారని వెనకేసుకొస్తున్నారు. తమ హయాంలో మద్యం కొనుగోలుకు డిజిటల్ పేమెంట్లు లేవని జగన్ చెప్పారు. తన తప్పు లేదు అని జగన్ అంటున్నారు.
గతంలో నగదు చెల్లింపులతో భారీ అవినీతి జరిగిందని తెలుస్తోంది అని వైఎస్ షర్మిల అన్నారు