మాజీముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ముఖ్యమంత్రి చేసి శాసనసభలో గౌరవాన్ని పెంపొందిస్తామని గుంటూరు జిల్లాలో మహిళలు శపథం చేశారు. తాడేపల్లి మండలం పెనుమాక లో ఈరోజు తెల్లవారుజామున తెలుగు దేశంపార్టీ మహిళలు ఏకమై అరచేత పసుపు పూసుకొని పెనుమాక గ్రామ సచివాలయం వద్ద ప్రతిజ్ఞ చేశారు.
ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో చంద్రబాబు నాయుడును వైసిపి మంత్రులు అవహేళన నేపథ్యంలో ఈ శపథం చేశారు. ఏ సభలో అయితే చంద్రబాబు గౌరవానికి భంగం కలిగించారో అదేస్థానంలో రారాజులా నిలబెడతామన్నారు. ముఖ్యమంత్రిగా సభలో అడుగు పెట్టే వరకూ కృషి చేస్తామన్నారు. ప్రతి క్షణం అవిషయం గుర్తు వచ్చేందుకు చేతికి పసుపు కంకణం కట్టుకున్నామని తెలిపారు.

