సాగునీటితో రాయలసీమ రైతుల దశ మార్చాలన్నది మా సిద్ధాంతం. అందులో భాగంగానే ఆనాడు ఎన్టీఆర్ హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టును తలపెట్టారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి కరువు నేలకు నీరిచ్చాం. గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లు తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాజెక్టు పనులు కూటమి ప్రభుత్వం రాగానే మళ్లీ పట్టాలెక్కాయి. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా, ఉరవకొండ నియోజకవర్గం, ఛాయాపురంలో హంద్రీనీవా సుజల స్రవంతి పనులను పరిశీలించాను. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నాను. నిర్దేశిత కాలానికి ఎట్టిపరిస్థితుల్లో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాను. ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో ఈ ప్రాజెక్టు ద్వారా 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 81 మండలాల్లో 33 లక్షల మందికి తాగునీటి సరఫరాకు అవకాశం లభిస్తుంది. సీమలో కీలకమైన ఈ ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యం ఇచ్చి పూర్తి చేస్తాం. సాగునీరు, డ్రిప్ సబ్సిడీలు ఇచ్చి రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మారుస్తాం.