తాజాగా మాహరాష్ట్రలోనూ శాసన సభ కౌన్సిల్‌కు ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ఈ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఈ ఎన్నికల్లో శివసేనా, కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ మూడు పార్టీలు ఏకమయ్యాయి. అయితే ఈ కూటమి కేవలం బీజేపీని ఓడించేందుకు ఏర్పదిచారని, అది వారి తరం కాదని కొందరు అన్నారు. తీరా ఫలితాలు వచ్చే సమయానికి బీజేపీ లెక్కలు మొత్తం తారుమారయ్యాయి. దాంతో ఫలితాలను ఉద్దేశించి బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడారు. మేము ఈ కూటమి మహా వికాస్ అగాదీ ఎంవీఏని తక్కువగా అంచానా వేశామన్నారు. మూడు పార్టీల బలాలను మేము సరిగ్గా లెక్కించలేక పోయామని, అందుకనే వారు విజయం సాధించారని అన్నారు. అయితే జరిగిన ఎన్నికలే కేవలం ఆరు సిట్లకు మాత్రమే జరిగియి వాటిలో బీజేపీ కేవలం ఒక్క సీటును మాత్రమే కైవశం చేసుకోగలిగింది. అయితే బీజేపీ పార్టీ శుక్రవారం తమ ఓటమికి కారణాలు తెలుసుకునేందుకు సమావేశం ఏర్పాటు చేసుకుందని రాష్ట్ర యూనియన్ మినిస్టర్ రావ్‌షాహెబ్ దాన్వే తెలిపారు. ‘ఈ ఎన్నికల్లో మేము కోరుకున్న ఫలితాలను ఎందుకు సాధించలేక పోయామనే దానిపై చర్చించుకునేందుక ఓ సమావేవం ఏర్పాటు చేసుకున్నాం. అంతేకాకుండా బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా మహరాష్ట్ర పర్యటన గురించి కూడా మాట్లాడుకున్నామ’ని తెలిపారు.
previous post
next post


రద్దుల ప్రభుత్వంలా వైసీపీ సర్కారు: చంద్రబాబు