telugu navyamedia
CBN Uncategorized ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినె్సకు మారాం: చంద్రబాబు

దావోస్ నుంచి గురువారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు, అక్కడి నుంచి బయలుదేరి శుక్రవారం సాయంత్రం ఉండవల్లి చేరుకున్నారు.

ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, నక్కా ఆనందబాబు, తంగిరాల సౌమ్య, శ్రీరాం తాతయ్య, శ్రావణ్ కుమార్, రామాంజనేయులు, భాష్యం ప్రవీణ్ తదితరులు దావోస్ పర్యటన ముగించుకొని వచ్చిన ముఖ్యమంత్రికి ఉండవల్లి నివాసం వద్ద పార్టీ నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు.

తెలంగాణకు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ దావోస్ లో బాగా కలిసి వస్తే, ఏపీకి చంద్రబాబు ఇమేజీ ఉపయోగపడుతోందని పార్టీ ఎమ్మెల్యేలు అన్నారు.

తనను కలవడానికి వచ్చిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఇంటి వద్ద కొద్దిసేపు మాట్లాడారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ను నేను కలిశాను. ప్రభుత్వాలకు కొనసాగింపు ఉన్న రాష్ట్రాలు అభివృద్ధిలో ఎలా ఉన్నాయో మారిపోతున్న చోట అభివృద్ధి ఎలా ఉందో పోల్చుతూ ఒక రిపోర్ట్ కార్డ్ తయారు చేయాలని నేను ఆమెను కోరాను.

దీనివల్ల ప్రజలకు కూడా కొంత అవగాహన వస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో మనం పదేళ్లు ఉండటం వల్ల మంచి ప్రగతి చూపించగలిగాం.

ప్రభుత్వాలు ఐదేళ్లకు ఒకసారి మారిపోతుంటే అభివృద్ధికి నష్టం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు.

‘‘రాష్ట్ర విభజన తర్వాత మనం ఒక పునాది వేశాం. అది ఒక స్థాయికి చేరకముందే ప్రభుత్వం మారిపోయింది.
తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం తన విధ్వంస పాలనతో ఆ పునాదిని నేలమట్టం చేసింది. ఇప్పుడు మళ్లీ మనం సున్నా నుంచి మొదలు పెట్టాల్సి వస్తోంది.

మన ప్రభుత్వానికి కొనసాగింపు ఉండి ఉంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ చాలా ఎత్తున ఉండేది’ అని ఆయన అన్నారు.

పలు దేశాల ప్రతినిధులు, అనేక కంపెనీల సీఈవోలు, కొన్ని దేశాల మంత్రుల బృందాలు రాష్ట్రంలో పర్యటించబోతున్నారు.

సంబంధిత శాఖల అధికారులు దీనికి సన్నద్ధంగా ఉండాలి. మౌలిక సదుపాయాలు, మారిటైం హబ్, ఏఐ యూనివర్సిటీ, గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు, డేటా కేంద్రాలు, ఆహార శుద్ధి రంగం, కోర్ ఇంజనీరింగ్, తయారీ రంగం, ఔషధ రంగం, పునరుత్పాదక ఇంధనం, ఇ-కామర్స్, పరిశోధన, విద్యా రంగానికి సంబంధించిన కంపెనీల అధికారులతో నేను దావో్సలో చర్చలు జరిపాను.

వచ్చే ఆరు నెలల కాలంలో ఇవి సాకారం కావడానికి మనం పట్టుదలతో పనిచేయాలి  అని అధికారులకు ఆయన తెలిపారు.

ఈ దిశగా చేపట్టాల్సిన చర్యలపై కొన్ని సూచనలు చేశారు.

దావోస్ సదస్సు సందర్భంగా ఒక జాతీయ మీడియా ప్రతినిధి వేసిన ప్రశ్నకు ఆయన ఇలా స్పందించారు. ‘‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినె్సకు మారాం.

ఐటీ నుంచి ఏఐకి వేగంగా వచ్చాం. రియల్ టైమ్లో ప్రజల నుంచి సమస్యలను విని, సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నాం.

ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిశీలించి ఎప్పటికప్పుడు పరిష్కరించడంపై దృష్టి సారించాలని పాలనా యాంత్రాంగాన్ని ఆదేశిస్తున్నాం’’అని చంద్రబాబు తెలిపారు.

Related posts