ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం వొడాఫోన్ మూడు కొత్త ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.47, రూ.67, రూ.78 ప్రీపెయిడ్ రీఛార్జ్‌లతో కాలర్ ట్యూన్, సర్వీస్ వ్యాలిడిటీ ప్రయోజనాలను అందించనుంది. ఈ మూడు ప్లాన్లు ఆల్‌రౌండర్ ప్యాక్‌లలో భాగం కాదు. ఈ స్పెషల్ రీఛార్జ్‌తో ఎలాంటి డేటా లేదా టాక్ టైం ప్రయోజనం వినియోగదారులకు లభించదు.
రూ.67 రీఛార్జ్‌తో 90రోజులు, రూ.47 రీఛార్జ్‌తో 28 రోజులు, 78 ప్యాక్‌తో 89 రోజుల పాటు వ్యాలిడిటీ అందిస్తోంది. ప్రస్తుతం ఈ ప్లాన్లు కొన్ని ప్రధాన సర్కిళ్లలో మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది.