*ఉక్కు ధర్నా..
* స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి ఏడాది..
* కదం తొక్కుతున్న ఉక్కు కార్మికులు
*విశాఖ ఉక్కు , ఆంధ్రలు హక్కు
* 365 జెండాలతో 365 మంది కార్మికల నిరసన
* విశాఖ ఉద్యమానికి ఏడాది పూర్తి..
* ప్రత్యేక కార్య చరణ ప్రకటించి ఉక్కు కార్మికులు..
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటు పరం చేయవద్దంటూ కార్మికులు ఆందోళన చేపట్టి నేటితో ఏడాది పూర్తవుతోంది. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరణ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిని వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి రోజూ ఆందోళనలను నిర్వహిస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళనలకు నేటికి ఏడాది పూర్తి కావడంతో 365 జెండాలతో నిరసన తెలపాలని నిర్ణయించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించవద్దంటూ కొనసాగుతున్న ఉద్యమానికి ఏపీలోని అధికార వైసీపీ నుంచి టీడీపీ, జనసేన పార్టీలు మద్దతు ప్రకటించాయి. వైసీపీ ఏకంగా పాదయాత్ర చేసింది. టీడీపీ నేత ఆమరణ దీక్షకు దిగారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒకరోజు ధర్నాలో పాల్గొన్నారు.
అయినా కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోవడంతో ఆందోళనలను మరింత ఉధృతం చేయాలని విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు నిర్ణయించారు. రేపు జైల్‌భరో నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.
వంద రోజుల పాలనలో ఏ ఒక్కపనీ చేపట్టలేదు: చంద్రబాబు