ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో ప్రపంచంలోనే తొలి ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు .
ఓర్వకల్లు మండలం గుమ్మితం తండా , పాణ్యం మండలం పిన్నాపురంలలో గ్రీన్‌కో ఎనర్జీస్ లిమిటెడ్ ఈ ప్లాంట్‌ను నెలకొల్పొతుంది. ఒకే యూనిట్ నుంచి సోలార్, విండ్, హైడల్ పవర్లను ఉత్పత్తి చేయడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత.
సీఎం పర్యటన నేపథ్యంలో గుమ్మితం తండాలో చేయాల్సిన ఏర్పాట్లపై జిల్లా అధికారులు, గ్రీన్‌కో ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు ఏర్పాట్లను పూర్తి చేశారు. పోలీసుల బందోబస్తు పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు.