తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో బాధితులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రత్యేక వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు చేసింది.
ఈ ఘటన తరువాత, సీఎం చంద్రబాబు నాయుడు సూచనల మేరకు గాయపడిన భక్తులతో పాటు వారి కుటుంబ సభ్యులతో కలిపి మొత్తం 52 మందికి ఈ అవకాశం కల్పించారు.
తొక్కిసలాటలో గాయపడి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వారందరికీ ఈ అవకాశం కల్పించారు. తొక్కిసలాట బాధితులతోపాటు వాళ్ల కుటుంబసభ్యులకు కూడా వైకుంఠ ద్వార దర్శనం చేయించింది టీటీడీ.
సీఎం చంద్రబాబు, మంత్రుల పరామర్శ సమయంలో ఇదే కోరుకున్నారు తిరుపతి తొక్కిసలాట బాధితులు తమకు వైకుంఠ ద్వార దర్శనం చేయించి ఇంటికి పంపాలని విజ్ఞప్తి చేశారు.
క్షతగాత్రులు కోరిన మేరకు మొత్తం 52మందికి ప్రత్యేక దర్శనం చేయించారు టీటీడీ అధికారులు.
తిరుపతి స్విమ్స్ లో ఇంకా 16మంది తొక్కిసలాట బాధితులకు చికిత్స కొనసాగుతోంది. క్షతగాత్రుల్లో ముగ్గురికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది.
డిశ్చార్జ్ అయిన 33మందికి 2లక్షల రూపాయల చొప్పున పరిహారం అంజేయనున్నారు. బాధితులను ఇంటికి చేర్చే బాధ్యతను కూడా ప్రభుత్వమే తీసుకుంది.