ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏపీకి కొత్త గవర్నర్ గా నియమితులైన హరిచందన్ కు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ‘తెలుగు’, ‘ఇంగ్లీషు’ భాషల్లో ఆయన ట్వీట్లు చేశారు. హరిచందన్ తనకు మిత్రుడని, బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. న్యాయవాదిగా, కవిగా, మంత్రిగా తనకు ఆయన సుపరిచితుడని చెప్పారు. ఎమ్మెల్యేగా, బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా ఆయన ప్రజా సేవలో విశిష్టంగా పని చేశారని, ఈ అనుభవం ఏపీని మరింత ముందుకు తీసుకెళుతుందని వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు.
రాష్ట్ర విభజన అనంతరం ఇప్పటికి ప్రత్యేకంగా గవర్నర్ ను నియమించారు. ఒడిశాకు చెందిన మాజీ మంత్రి, ప్రముఖ న్యాయవాది బిశ్వ భూషణ్ హరిచందన్ ను గవర్నర్ గా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. వారం రోజుల్లోగా ఏపీ గవర్నర్ గా ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని గవర్నర్ నివాసంగా మార్చే అవకాశం.


తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయింది: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి