telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రముఖ నటుడు కన్నుమూత… ప్రభుత్వ లాంఛనాలతో అంత్య‌క్రియ‌లు సీఎం ప్రకటన

Bijay

ప్రముఖ ఒడియా సీనియర్ నటుడు బిజయ్ మొహంతి మరణవార్త మరోసారి సినీ లోకాన్ని విషాదంలో ముంచెత్తింది. ఆయన వయసు 70 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న బిజయ్ మొహంతి సోమవారం సాయంత్రం కన్నుమూశారు. మొహంతి మృతి పట్ల ఒడిస్సా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో పాటు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేశారు. బిజయ్ మొహంతి మరణంతో ఒడియా చిత్రసీమలో ఒక శకం ముగిసిందని, ఈ మరణం ఇండస్ట్రీలో తరగని అంతరాన్ని కలిగించిందని ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్‌ అన్నారు. ఒడియా కళా ప్రపంచంపై మొహంతి వేసిన ముద్ర కళా ప్రేమికుల హృదయాల్లో ఎప్పటికీ అలాగే నిలిచిపోతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ లాంచనాలతో ఆయన అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు సీఎం తెలిపారు. అదేవిధంగా ఒడిశాకు చెందిన కేంద్ర‌ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రియాక్ట్ అవుతూ.. బిజయ్ మొహంతి మరణించారని తెలిసి చాలా బాధేసిందని అన్నారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా అని పేర్కొన్నారు. “చిలికా టైర్‌తో” మూవీతో కెరీర్‌ను ప్రారంభించిన బిజయ్ మొహంతి.. నగా ఫాసా, సమయ్ బడా బాలాబన్, దండా బలూంగా, చ‌కా అఖి సాబు దేఖుచి వంటి అనేక ఒడియా చిత్రాలలో నటించి కీర్తి గడించారు. మొహంతికి భార్య తాండ్రా రే(ఒడియా చిత్ర పరిశ్రమలో నటి), కుమార్తె జాస్మిన్ ఉన్నారు.

Related posts