పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్న చిత్రం ‘ఉప్పెన’. సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు సానా ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ‘ఉప్పెన’కు దర్శకత్వం వహించడంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలను కూడా బుచ్చిబాబే అందించారు. తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇది ఇలా ఉండగా… ఈ సినిమా ఈ ఏడాది వేసవిలో విడుదల కావాల్సి ఉంది. కరోనా, లాక్‌డౌన్ కారణంగా ఇది జరగలేదు. ఓటీటీ ల నుంచి మంచి ఆఫర్స్ వచ్చినా నిర్మాత మాత్రం థియేట్రికల్ విడుదలకే సిద్ధమయ్యాడు. తాజాగా సంక్రాంతి కి సినిమా వస్తుందని భావించగా.. ఆ సమయంలో భారీగా సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. దీంతో ఈ మూవీ విడుదల మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది.
previous post
next post