telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు విద్యా వార్తలు

చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలో విద్యా వ్యవస్థలో చక్కటి ఫలితాలు ఇస్తున్నాయ: పవన్ కల్యాణ్

రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తీసుకొస్తున్న సంస్కరణలు చక్కటి ఫలితాలను ఇస్తున్నాయని, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు మెరుగవుతున్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రశంసించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలో విద్యా వ్యవస్థలో వస్తున్న సానుకూల మార్పులకు కడపలో ఏర్పాటైన ‘స్మార్ట్ కిచెన్’ ఒక ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు.

గతంలో కడప మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్‌లో జరిగిన మెగా పేరెంట్ టీచర్స్ సమావేశంలో పాల్గొన్నప్పుడు, జిల్లా కలెక్టర్ సూచించిన ‘స్మార్ట్ కిచెన్’ ఆలోచన తనను ఎంతగానో ఆకట్టుకుందని పవన్ కల్యాణ్ గుర్తుచేసుకున్నారు.

బడి పిల్లలకు డొక్కా సీతమ్మ గారి పేరుతో పరిశుభ్రమైన, పోషకాలతో కూడిన భోజనం అందించాలనే లక్ష్యంతో ఈ కిచెన్ నిర్మాణానికి తన వ్యక్తిగత నిధులను అందించినట్లు ఆయన వెల్లడించారు.

ప్రస్తుతం ఈ ‘స్మార్ట్ కిచెన్’ నిర్మాణం పూర్తయిందని, ఇక్కడి నుంచే నగరంలోని 12 పాఠశాలలకు ఆహారాన్ని సరఫరా చేస్తారని తెలిపారు. పోషకాహార నిపుణుల సలహాలతో, అనుభవజ్ఞులైన వంట సిబ్బంది ద్వారా రుచికరమైన భోజనాన్ని విద్యార్థులకు అందిస్తారని వివరించారు.

ఈ ‘స్మార్ట్ కిచెన్’ రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ బృహత్కార్యాన్ని దగ్గరుండి పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి గారిని పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా అభినందించారు.

Related posts