నేచురల్ స్టార్ నాని నటించిన ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ డ్రామా “టక్ జగదీష్” భారీ డీల్ క్యాన్సిల్ ? థియేటర్స్ ఓపెన్ అయినా కూడా వాటిపై నమ్మకం లేక ఓటిటి వైపు అడుగులేస్తున్నారు నిర్మాతలు. “టక్ జగదీష్” ఎప్పుడో పూర్తయిన ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు. ఈ క్రమంలోనే టక్ జగదీష్ కూడా ఓటిటికే వెళ్లిపోయిందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మరో ట్విస్ట్ వచ్చింది.
ఈ మూవీని ఓటిటి ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయబోతున్నారు అంటూ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ వచ్చింది. ముందు నుంచి కూడా ఈ సినిమాను థియేటర్స్‌లో విడుదల చేయాలనుకున్నా కూడా పరిస్థితుల ప్రభావంతో టక్ జగదీష్‌ను ఓటిటికి ఇచ్చేసారని ప్రచారం జరుగుతుంది. దీనికోసం 37 కోట్ల డీల్ కూడా పూర్తైపోయిందని వార్తలొచ్చాయి.
అయితే ఇప్పుడు “టక్ జగదీష్” మేకర్స్ మూవీ డిజిటల్ విడుదలకు సంబంధించిన ఒప్పందాన్ని రద్దు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సినిమాను థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
ఇటీవల విడుదలైన అయితే ఈ మధ్యే కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన “ఎస్ఆర్ కళ్యాణమండపం” చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. తెలుగు సినిమా ప్రేమికులు సినిమా హాళ్లకి రావడానికి ఆసక్తి చూపుతున్నారు. “టక్ జగదీష్” మేకర్స్ డిజిటల్ రిలీజ్ ఒప్పందాన్ని రద్దు చేయడానికి ప్రధాన కారణం అదే. “టక్ జగదీష్” విడుదల గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.
కాగా..శివ నిర్వాణ దర్శకత్వం వహించిన “టక్ జగదీష్” చిత్రంలో రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు నటించారు. నాని “జగదీష్” అనే టైటిల్ పాత్రలో నటిస్తున్నాడు.
కాస్త క్లోజ్‌గా ఉంటే లవ్ వచ్చేస్తుందా?… అమ్మ రాజశేఖర్ భార్య ఫైర్