ఈ రోజుల్లో ఇప్పుడు అందరివీ ఉరుకులు, పరుగుల జీవితాలు. ప్రశాంతంగా కాసేపు ఎక్కడా విశ్రాంతి తీసుకోవట్లేదు. బిజీ లైఫ్‌స్టైల్ అయిపోయింది. ఏ రోజు, ఏ గంటలో ఏమేం చేయాలో ముందే రాసిపెట్టుకుని యంత్రాల్లా గడిపేస్తున్న బతుకులు. ఒంట్లో శక్తి అంతా హరించుకుపోయి.. మనసులో గంపెడన్ని ఆందోళనలతో.. నిద్రకూడా సరిగా పట్టని పరిస్థితి.
ఇలా మనం ఎక్కడికి పరుగులు పెడుతున్నామో… ఎందుకో మనకే తెలియదు. ఇలా విశ్రాంతి తీసుకోకుండా కష్టపడటం కరెక్టు కాదనే అభిప్రాయంతో… సంవత్సరంలో ఒక్క రోజైనా ఏ పనీ లేకుండా ఉండాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చినదే జాతీయ బద్ధక దినోత్సవం.
ఈ రోజున ప్రపంచ దేశాల ప్రజలు చిన్న పని కూడా చెయ్యకూడదన్నది నియమం. కాసేపు విశ్రాంతి తీసుకుంటే.. మళ్లీ ‘రీఫ్రెష్’ అయిపోతామని అంటుంటారు. కానీ అది జస్ట్ ‘రిపేర్’ చేసుకోవడం మాత్రమేనని శాస్త్రవేత్తలు, వైద్యులు స్పష్టం చేస్తున్నారు. శరీరానికి పునరుత్తేజం రావాలంటే.. కాస్త ‘లేజీనెస్’ అలవర్చుకోవాలని చెప్తున్నారు.
అయితే .. విశ్రాంతి అంటే కాసేపు నిద్రపోవడమో.. లేకుంటే సినిమా, షికారు వంటి పనులు పెట్టుకోవడమో చేస్తుంటారని.. అక్కడ నిజంగా విశ్రాంతి ఎక్కడుంటుందని శాస్త్రవేత్తలు గుర్తు చేస్తున్నారు. ‘లేజీనెస్’ అంటే.. ఆందోళనలు, సమస్యలు అన్నీ పక్కనపడేసి.. మీకు నచ్చిన ఫుడ్ తిని, మీకు నచ్చినట్టుగా సోఫాలోనో, బెడ్ మీదో బద్ధకంగా పడిపోవడం అని చెప్తున్నారు.
అంతేకాదు..టీవీలోనో, ఫోన్‌లోనో నచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూస్తూ గడపాలని, ఎట్లాంటి ఆలోచనలూ పెట్టుకోకండి. అలా బద్ధకంగా కూలబడి.. నచ్చిన సంగీతం, పాటలు వినండి. ఇవన్నీ మీరు మానసికంగా, శారీరకంగా పునరుత్తేజితం కావడానికి తోడ్పడతాయని శాస్త్రవేత్తలు, వైద్యులు చెప్తున్నారు.
అందరూ… అతిగా కష్టపడిపోయి… మన ఎనర్జీలను వృథా చేసుకుంటున్నామట. అందువల్ల కనీసం ఇలాంటి రోజునైనా ఎనర్జీ లెవెల్స్ పెంచుకోమని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి.
కాంగ్రెస్‌కు ఓటేస్తే టీఆర్ఎస్కు వెళ్లే పరిస్థితులు: కిషన్ రెడ్డి