తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. ఆర్టీసీ కార్మికుల విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీ కార్మికులను డిస్మిస్ చేసిన ఆయన.. వారికి వైద్యాన్ని కూడా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను విధులనుంచి తొలగించడంతో హైదరాబాద్ లో వైద్యసేవలు నిలిపివేశారు.
తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిలో సిబ్బందికి వైద్యం నిలిపి వేశారు. సర్కార్ వైద్యం నిలిపివేయడంపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తార్నాక హాస్పిటల్ ముందు ఉద్యోగులు ధర్నా చేపట్టారు. గవర్నర్ కలిసి సమ్మె గురించి వివరిస్తామని ఆర్టీసీ కార్మికులు వెల్లడించారు.

