2019 సంవత్సరానికిగాను 92వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ వేడుక అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సెన్సైస్ (Academy of Motion Picture Arts and Sciences-AMPAS) అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లోని డాల్బి థియేటర్‌లో అట్టహాసంగా జరుగుతోంది. కాగా… డిస్నీ/ఫిక్చర్ నుంచి వచ్చిన టాయ్ స్టోరీ-4 యానిమేటెడ్ మూవీ బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ అవార్డును సొంతం చేసుకుంది. ఆస్కార్ అవార్డును అందుకున్న జోష్ కూలే మాట్లాడుతూ.. ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. టాయ్ స్టోరీ ఇది నాలుగవ ఫిల్మ్ అన్నారు. ఈ మూవీలోని పాత్రలు ఎంతో అద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులను మెప్పించాయి. ఇదొక భయపడే వ్యక్తి గురించి స్టోరీ’ అని కూలే తెలిపారు. యానిమేషన్ ఫిల్మ్ అవార్డుల రేసులో ఈ ఏడాదిలో టాయ్ స్టోరీ-4 నిలవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. 2002లో తొలి ఆస్కార్ అవార్డు అందుకున్న ఈ మూవీ ఫ్రాంచైజీ.. యానిమేటెడ్ ఫీచర్ కేటగిరీలో తొలిసారి రెండు అకాడమీ అవార్డులను సొంతం చేసుకుంది. 2011లో టాయ్ స్టోరీ 3 మూవీకి కూడా యానిమేటెడ్ ఫిల్మ్ కేటగిరీలో అవార్డు గెలుచుకుంది. ఫిల్మ్ డైరెక్టర్ జోష్ కూలేకు ఈ అవార్డులన్నీ దక్కాయి. గతంలో ఫిక్చర్ ఇన్ సైడ్ ఔట్ స్ర్కీన్ ప్లే కేటగిరీలో ఎంపిక అయిన జోష్ కూలే.. టాయ్ స్టోరీ 4 మూవీతో బెస్ట్ డైరెక్టర్ లిస్టులో చేరారు. ఇక నిర్మాత మార్క్ నెల్సన్ తొలిసారి నామినేషన్ లో నిలిచారు. జోనాస్ రివేరా గతంలో ప్రొడ్యుసింగ్ ఇన్ సైడ్ ఔట్ మూవీకి ఆస్కార్ అవార్డు గెలుచుకున్నారు. ఈ ఏడాదిలో యానిమేషన్ ఫిల్మ్ అవార్డులకు నామినేట్ అయిన ఇతర మూవీల్లో డ్రీయావర్క్క్ యానిమేషన్ మూవీ “హౌ టూ ట్రైన్ యువర్ డ్రాగన్”, “ది హిడన్ వరల్డ్”, “లైకా మిస్సింగ్ లింక్” ఉన్నాయి.
previous post

