telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

నేటి నుంచి తెలంగాణలో మద్యం విక్రయాలు

liquor maals

తెలంగాణలో నేటి నుంచి వైన్‌షాపులు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి ఎక్సైజ్ అధికారులు, యజమానులు వైన్‌షాపుల ముందు సామాజిక దూరాన్ని పాటించే విధంగా క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలను బుధవారం నుంచి తెరుస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

రాష్ట్రంలో 2200 మద్యం దుకాణాలకు గాను కంటైన్మెంట్‌ జోన్లలోని 15 షాపులు మినహా .. మిగతా అన్ని దుకాణాలూ తెరుచుకుంటాయని చెప్పారు. అయితే బార్లు, పబ్బులు, క్లబ్‌లకు మాత్రం అనుమతి నిరాకరించారు. అలాగే మద్యం ధరలను గరిష్ఠంగా 16 శాతం వరకు పెంచుతున్నామని, పేదలు ఎక్కువగా వినియోగించే చీప్‌ లిక్కర్‌పై 11 శాతం, ధనికులు ఎక్కువగా వినియోగించే ఇతర రకాల మద్యంపై 16 శాతం పెంపు ఉంటుందని తెలిపారు. అమ్మేవారు కొనేవారు మాస్కులు ధరించి బౌతిక దూరం పాటించాలని సూచించారు.

Related posts