telugu navyamedia
రాశి ఫలాలు

ఈరోజు ఈరాశి వారి ఆర్ధిక పరిస్థితులు చక్కబడతాయి

Today Rasi Phalalu

మేష రాశి
అనవసరమైన టెన్షన్, వర్రీ మీమ్ జీవన మాధుర్యాన్ని పీల్చేసి, పిప్పి చేసి వదులుతాయి. వీటిని వదిలించుకొండి, లేకపోతే, అవి మీ సమస్యను మరింత జటిలం చేస్తాయి. స్పెక్యులేషన్ ద్వారా లేదా అనుకోని లబ్ది పొందడం వలన ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి. ప్రేమ స్నేహం బంధం ఎదుగుతాయి. మీరు మంచిగా డెవలప్ అవడంతో, మీ ప్రేమైక జీవితం మెరుగైన మలుపు తీసుకుంటుంది. క్రొత్తవి నేర్చుకోవాలన్న మీ దృక్పథం బహు గొప్పది. షాపింగ్ కి వెళ్ళినప్పుడు దుబారా ఖర్చులు మానండి. మీ జీవిత భాగస్వామి తాలూకు రొమాంటిక్ భావాల పరాకాష్టను ఈ రోజు మీరు చవిచూడనున్నారు.

వృషభ రాశి
వత్తిడి మీకు, చిన్నపాటి అనారోగ్యాన్ని కలిగిస్తుంది. రిలాక్స్ అవడానికి స్నేహితులు, మరియు కుటుంబ సభ్యుల మధ్యన కూర్చొండి. మదుపు చేయడం మంచిదే కానీ సరియైన సలహా తీసుకొండి. ఈ రోజు మీ చర్యలను చూసి, మీరు ఎవరితో ఉంటున్నారో, వారు, మీ పట్ల కోపం తెచ్చుకుంటారు. ఇంట్లో సమస్యలు తలెత్తవచ్చును.- అయినా, చిన్న విషయాలకు మీ శ్రీమతిని విమర్శించడం మానండి. ‘సహ ఉద్యోగులు, సీనియర్లు పూర్తి సహకారం అందించడం తో ఆఫీస్ లో పని త్వరిత గతిన అవుతుంది. మీ పదునైన పరిశీలన మిమ్మల్ని అందరికంటె ముందుండేలాగ చేయడానికి సహాయపడుతుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు తీవ్రంగా గొడవపడవచ్చు.

మిథున రాశి
మీ ఆరోగ్యాన్ని గురించి ఆందోళన పడకండి, దానివలన అది మరింత దిగజారవచ్చును. పెట్టుబడి పథకాలవిషయంలో ఆకర్షణీయంగా కనిపించినా లోతుగా ఆలోచించి మూలాలు పూర్వాపరాలు మరిన్ని తెలుసుకొండి. ఈ విషయంలో ఏదైనా కమిట్ అయేముందు నిపుణులు, అనుభవజ్ఞుల సలహా పొందండి. యువతను కలుపుకుంటూ పోయే కార్యక్రమాలలో నిమగ్నం కావడానికి ఇది మంచి సమయం. ఈ రోజు మీకు ప్రియమైన వారిని క్షమించడం మరచిపోకండి. ఆఫీసులో పని విషయంలో మీతో నిత్యం కీచులాడే వ్యక్తి ఈ రోజు మీతో చక్కగా మాట్లాడనున్నాడు. మీకు సన్నిహితంగా ఉండే వారొకరు అంతుపట్టని మూడ్ లో ఉంటారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఇతరుల ప్రభావంలో పడి మీతో గొడవ పడవచ్చు. కానీ మీ ప్రేమ, సహానుభూతి వల్ల చివరికి అంతా సర్దుకుంటుంది.

కటక రాశి
మిమ్మల్ని ప్రభావితం చేసే భావాలను గుర్తించండి. మీ వ్యతిరేక ఆలోచనలను అంటే, భయం, సందేహాలు, దురాశ వంటివి పూర్తిగా వదలి పెట్టండి. ఎందుకంటే, ఈపని చేస్తే, మీకుకావలసిన వాటికి సరిగ్గా వ్యతిరేకంగా మిమ్మల్ని అయస్కాంతంలాగ ఆకర్షిస్తుంది. మీ ఇంటిగురించి మదుపు చెయ్యడం లాభదాయకం. పిల్లలు తమవిజయాలతో మిమ్మల్ని, గర్వపడేలాగ, తలెత్తుకునేలా చేస్తారు. ఈ అద్భుతమైన రోజున మీ ఫిర్యాదులు, కోపతాపాలన్నీ చేత్తో తీసేసినట్టుగా మాయమవుతాయి. ఈరోజు ఎక్కువ పని చెయ్యడానికి, ఉన్నతంగా ఉండడానికి హై ప్రొఫైల్ కి తగినది. ఈరోజు మీరొక స్టార్ లాగ ప్రవర్తించండి- కానీ మెప్పుపొందగల పనులనే చెయ్యండి. వైవాహిక జీవితంలో ఎన్నో సానుకూలతలు కూడా ఉన్నాయి. వాటన్నింటినీ మీరు ఈ రోజు అనుభూతి పొందనున్నారు.

సింహరాశి
ఈమధ్యన ఎంతో మానసికపరమైన ఒత్తిడి కలగడంతో- విశ్రాంతి ముఖ్యమనిపించే రోజు వినోదం, ఆటవిడుపులు మీకు సేదతీరగలవు. మీరు ఇతరుల కోసం ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు. మీకుటుంబంలోకి క్రొత్త సభ్యుని రాక వార్త మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఆశావహులై ఒక పార్టీని ఇచ్చెయ్యండి. ప్రతిరోజూ ప్రేమలో పడడం అనే స్వభావాన్ని మార్చుకొండి. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ లు, పథకాలు కదిలి ఫైనల్ షేప్ కి వస్తాయి. అనుకోని ప్రయాణం కొంతమందికి బడలికని, వత్తిడిని కలిగిస్తుంది. ఉదయాన్నే కరెంటు పోవడం వల్లో, మరో కారణం వల్లో మీరు వేళకు తయారు కాలేకపోతారు. కానీ మీ జీవిత భాగస్వామి మీకు సాయపడి గట్టెక్కిస్తారు.

కన్యా రాశి
ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు, అలసటలు, బ్రతుకులోని కష్టాలు నుండి రిలీఫ్ పొందబోతున్నారు. వాటన్నిటిని అక్కడే వదిలేసి, హాయిగా శాశ్వతంగా ఆనందంగా జీవితాన్ని గడపడానికి జీవిత విధానాన్ని మార్పు చేయడానికి ఇదే మంచి సమయం. ధనలాభాలు మీరు అనుకున్నంతగా రావు. ఒక ఉల్లాసాన్నిచ్చే సాయంత్రం గడపడానికి మీ స్నేహితులు, వారుండే చోటికి మిమ్మల్ని ఆహ్వానిస్తారు. మీ భాగస్వామి లేనప్పుడూ, మీరు వారి సాన్నిధ్యాన్ని అనుభవిస్తారు. కొంతమందికి వ్యాపారం, విద్య అనుకూలిస్తాయి. పెండింగ్ లో గల సమస్యలు త్వరలో పరిష్కరించబడాల్సి ఉన్నది, పైగా ఎక్కడో అక్కడ మొదలు పెట్టాలి, అందుకే, సానుకూలంగా స్పందించండి, మీ శ్రమను ఈరోజే మొదలు పెట్టండి. మీరు, మీ భాగస్వామి ఈ రోజు ఓ అద్భుతమైన వార్తను అందుకుంటారు.

తులా రాశి
మీ సందేహ స్వభావం, ఓటమిని చూపుతుంది. చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకి వచ్చేలాగ ఉన్నాయి. మీ చక్కని ఆరోగ్యం కొరకు, బయట ఎక్కువ దూరం నడవండి. మీరు కొద్దిసేపు పరాకుగా ఉన్నారనుకొండి, మీ సహ ఉద్యోగులు/ సహకరించే అసోసియేట్ లు మీకు సహాయం అందించడానికి కొద్దిసేపు మాత్రం రాగలరు- అంతేకానీ అంతకంటె ఎక్కువ సహాయం అందించలేరు. మీకు పనిపట్ల విధేయత, పనులు జరిగేలా చూడడంలో మీ సామర్థ్యం, మిమ్మల్ని గుర్తింపు వచ్చేలా చేస్తాయి. మీరు, మీ భాగస్వామి ఈ రోజు ఓ అద్భుతమైన వార్తను అందుకుంటారు.

వృశ్చికరాశి
పనివత్తిడి, విభేదాలు కొంత వత్తిడిని కలగచేస్తాయి. చిరకాలంగా వసూలవని బాకీలు వసూలు కావడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ సామాజిక జీవితాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. కొంత వీలుచేసుకునైనా పార్టీలు వంటివాటికి మీ కుటుంబ సభ్యులతో హాజరు అవుతూ ఉండండి. అది మీ మూడ్ ని రిలాక్స్ చెయ్యడమే కాక మీలోని సందిగ్ధత ని కూడా తొలగిస్తుంది. అకస్మాత్తుగా జరిగే రొమాంటిక్ ఎన్ కౌంటర్, మీ హుషారును లిఫ్ట్ చేయగలదు. మీ జీవితం ఈ రోజు ఒక అందమైన మలుపు తిరగనుంది. ప్రేమలో ఉన్నప్పుడు కలిగే స్వర్గానుభూతిని ఈ రోజు మీరు చవిచూస్తారు. మీరు ఎప్పుడూ వినాలి అనుకున్నట్లుగా నే జనులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. మీ మనసు మాటను పూర్తిస్థాయిలో వినేందుకు కావాల్సినంత సమయాన్ని మీ జీవిత భాగస్వామి మీకు ఇస్తారు.

ధనుస్సు రాశి
అందమైన సున్నితము కమ్మని సువాసన, ఉన్న కాంతివంతమైన పూవు వలె, మీ ఆశ వికసిస్తుంది. రోజులోని రెండవభాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీరు నమ్మిన ఒకరు మీకు పూర్తి నిజాన్ని చెప్పరు.- ఎదుటివారిని ఒప్పుకునేలాచేయగల మీ నేర్పు ఈ రానున్న సమస్యలను పరిష్కరించుకోవడంలో ఉపకరిస్తుంది. ప్రేమలో మీ కఠినత్వానికి, క్షమాపణ చెప్పండి ఈ రోజు, చాలా చురుకుగాను, మీ అందరికీ చాలా చక్కని సోషల్ డే గా ఉంటుంది. మీ నుండి సలహా కోసం వారు ఎదురు చూస్తారు. మీ నోటి నుండి ఏది వస్తే దానినే అంగీకరించి, శిరసా వహిస్తారు. వాదులాటకి దిగినప్పుడు, పరుషమైన వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్త వహించండి మంచి తినుబండారాలు, లేదా ఒక చక్కని కౌగిలింత వంటి మీ జీవిత భాగస్వామి తాలూకు చిన్న చిన్న కోరికలను మీరు గనక ఈ రోజు పట్టించుకోలేదంటే తను గాయపడవచ్చు.

మకర రాశి
శ్రీమతి మిమ్మల్ని హుషారుగా ఉంచుతారు. ఈ రోజు, మూలధనం సంపాదించగలుగుతారు- మొండిబకాయిలు వసూలు చేస్తారు. లేదా క్రొత్త ప్రాజెక్ట్ లకోసం నిధులకోసం అడుగుతారు. మీచదువులను ఫణంగా మీరు బయటి ఆటలలో అతిగా పాల్గొంటుంటే, అది మీ తల్లిదండ్రులకు సంకట పరిస్థితిని కలిగిస్తుంది. భవిష్యత్ ప్రణాళిక కూడా క్రీడలకు గల ప్రాముఖ్యతతో సమానమే. మీ తల్లిదండ్రుల సంతోషం కోసం మీరు రెండింటినీ బ్యాలన్స్ చేయడం ఉత్తమం. మీ ప్రేమికురాలిని నిరాశ పరచకండి- లేకపోతే తరువాత విచారించవలసి వస్తుంది. ఆఫీసులో మీ శత్రువులే మీరు చేసే ఒక మంచి పని వల్ల ఈ రోజు మీ మిత్రులుగా మారనున్నారు. ఈరోజు, సామాజిక మరియు మతపరమయిన వేడుకలు చోటు చేసుకుంటాయి. ఈ రో జు మీరు మీ జీవిత భాగస్వామిని రొమాంటిక్ డేట్ కు తీసుకెళ్తే, అది మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది.

కుంభరాశి
మీరు దారుణంగా భావోద్వేగంతో ఉంటారు, కనుక మీరు హర్ట్ అయే చోట్లకి చెళ్ళకుండా దూరంగా ఉండండి. అంతగా ప్రయోజనకరమైన రోజు కాదు- కనుక, మీవద్దగల డబ్బును జాగ్రత్తగా చెక్ చేసుకుని మీ ఖర్చులను పరిమితం చేసుకొండి. మీ అభిరుచులకు, ఇంకా కుటుంబసభ్యులతోను సమయం కేటాయించగలరు. విలువైన కానుకలు/ బహుమతులు కూడా మీకేమీ సంతోషం కలిగించలేవు, ఎందుకంటే, మీ లవర్ చేత అవి తిరస్కరించబడినవే కావచ్చును. ఆఫీసులో మీ పనికి మెచ్చుకోళ్లు దక్కవచ్చు. ఉదారత మరియు సమాజసేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి. మీరుకనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే, మీకు తేడా చాలాఎక్కువగా కానవస్తుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మరీ స్వార్థపూరితంగా వ్యవహరించవచ్చు.

మీన రాశి
ఈరోజు కార్యక్రమాలలో ఇండోర్, ఔట్ డోర్ అంటే, ఇంటిలోపల ఆడేవి, బయట ఆడేవి ఉండాలి. ఆర్థిక లబ్దిని తెచ్చే క్రొత్తది, ఎగ్జైటింగ్ పరిస్థితిని అనుభూతిస్తారు. మీ అతి ఉదార స్వభావాన్ని బంధువులు అలుసుగా తీసుకుని దుర్వినియోగపరచడానికి ప్రయత్నిస్తారు. మీకుమీరుగా నియంత్రించుకొండి. లేకుంటే, మోసపోతారు. మీరు గుర్తు ఉంచుకోవలసినది ఏమంటే, ఉదారత కొంతవరకే అయితే మంచిదే, కానీ మితిమీరితే ప్రమాదాలకు దారి తీస్తుంది. వ్యక్తిగత బంధుత్వాలు సున్నితంగాను ప్రమాదకరంగాను ఉంటాయి. వ్యవస్థాపకులతో కలిసి వెంచర్లను మొదలు పెట్టండి. ఏదైనా స్వచ్ఛందంగా సహాయం చెయ్యడం అది పొందినవారికే కాదు మీకయితే ఎప్పుడు వెనక్కి ఆలోచించుకున్నాకూడా సానుకూలత తోచుతుంది. మూడ్ బాగా లేకపోవడం వల్ల ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు ఇబ్బంది పడవచ్చు.

Related posts