కరోనా వైరస్ అలాగే కొత్త ఏడాది ప్రభావంతో బంగారం ధరలు ఇవాళ పెరిగిపోయాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు క్రమంగా పెరిగిన విషయం తెలిసిందే. దీపావళి పండుగ అయిపోగానే బంగారం ధరలు దిగివచ్చాయి. దీపావళి కంటే ముందు బంగారం, వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. కరోనా వైరస్ విజృంభించిన తర్వాత బంగారం ధరలు చుక్కలు చూపించిన ఇప్పుడు మళ్ళీ మార్కెట్ పుంజుకోవడంతో ధరలు తగ్గాయి. కానీ ఈరోజు ఢిల్లీలో హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగిపోయాయి. కరోనా అనంతరం 50 వేల ను దాటింది బంగారం. అయితే ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 10 పెరిగి రూ. 53,310 పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 10 పెరిగి రూ. 48,860 వద్ద ముగిసింది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే.. బంగారం ధరలు ఇవాళ కొంచెం పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 10 పెరిగి రూ. 50,960 వద్ద ఉండగా… 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా ఉండి రూ. 46,700 పలుకుతోంది. ఇక వెండి విషయానికి వస్తే రూ. 100 పెరిగి రూ.72,300 కి చేరుకుంది.
							previous post
						
						
					
							next post
						
						
					

