telugu navyamedia
సినిమా వార్తలు

సెకండ్ ఇన్నింగ్స్‌లో జోరు పెంచిన బాస్‌..!

చాలా గ్యాప్ త‌రువాత‌ మెగాస్టార్ చిరంజీవి “ఖైదీ నెంబర్ 150” సినిమా తో భారీ రేంజ్ లో సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లు పెట్టారు. యువ హీరోల కంటే ప్రస్తుతం చిరంజీవి చేతుల్లో ఎక్కువ సినిమాలు ఉన్నాయి . డైరెక్ట‌ర్స్ చిరంజీవి ఇంటి చుట్టూ క్యూ క‌డుతున్నార‌న‌డం లో అతిశ‌యోక్తి లేదు.

ఆగస్టు 22న చిరంజీవి పుట్టిన రోజు నాడు తాజా అప్డేట్ ప్రకారం మెగాస్టార్ సినిమా కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ 3 టైటిల్స్ ను రిజిస్టర్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న “ఆచార్య” సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతోంది. ఈ మ‌ధ్యే“ఆచార్య” చిత్రాన్ని పూర్తి చేసిన చిరంజీవి ప్రస్తుతం “లూసిఫర్” రీమేక్ కోసం సిద్ధంగా ఉన్నారు. తమిళ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న ఈ మూవీకి “గాడ్ ఫాదర్” అనే టైటిల్ ను మేకర్స్ పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.

Megastar Chiranjeevi talks about his future projects after 'Acharya' | Telugu Movie News - Times of India

ఈ సినిమా తర్వాత చిరంజీవి మరో తమిళ రీమేక్ “వేదాళం” మూవీలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం బాధ్యతలు చేపడుతున్నారు. ఈ రీమేక్ కోసం ఫిలింఛాంబర్లో ఆటో జానీ, అన్నయ్య కోసం, బోలా శంకర్ అనే 3 టైటిల్స్ ను రిజిస్టర్ చేయించిందని సమాచారం. చిరంజీవి 154వ సినిమాగా వీటిలో ఏదో ఒక టైటిల్ ను ఖరారు చేస్తారు.

మ‌రోప‌క్క మెగాస్టార్ రీఎంట్రీ సమయంలో పూరీ, చిరు కాంబోలో మూవీ ఉంటుందని, దానికోసం “ఆటో జానీ” అనే టైటిల్ అనుకుంటున్నారని వార్తలు వచ్చాయి. ఇది మాత్రమే కాక చిరంజీవి తన 156వ సినిమా కామెడీ సినిమాలు తీయడంలో దిట్ట అయిన మారుతి దర్శకత్వంలో చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే వి వి వినాయక్ కూడా మెగాస్టార్ తో సినిమా చేసే ఆలోచనలో ఉన్న‌ట్లు సినీ వ‌ర్గాల స‌మ‌చారం.

HBD Chiranjeevi: Nivin Pauly, Jackie Shroff and other celebrities release the common display motion poster of the megastar : Bollywood News - Bollywood Hungama

ఇక‌పోతే చిరు పుట్టిన రోజు కోసం మెగా అభిమానుల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ ప్రత్యేక రోజున ట్విట్టర్ సెషన్ లో పలువురు సెలబ్రిటీలు సందడి చేయడానికి సిద్ధమయ్యారు. దీనికి ప్ర‌ముఖ యాంక‌ర్‌ సుమ హోస్ట్ గా వ్యవహరిస్తుందని తెలుస్తోంది .

Related posts