telugu navyamedia
రాజకీయ వార్తలు

బీజేపీ ప్రభుత్వ హయాంలో ఈసీ అసలైన స్వతంత్ర సంస్థగా మారిందన్న ప్రధాని

ఎన్నికల సంఘం విశ్వసనీయతపై ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న సందేహాలకు ప్రధాని ఈ సమాధానం ఇచ్చారు.

విపక్షాల వాదనను ఆయన ఖండించారు. గతంలో 50-60 ఏళ్ల పాటు ఎన్నికల సంఘంలో ఒక్కరే సభ్యులుగా ఉండేవారంటూ కాంగ్రెస్ పేరు ప్రస్తావించకుండా మోదీ విమర్శించారు.

ఎన్నికల అధికారులు ఆ తర్వాత గవర్నర్లు, ఎంపీలు అయ్యారని కాంగ్రెస్పై పరోక్ష ఆరోపణలు

కాగా 2024 లోక్సభ ఎన్నికల మొదటి, రెండవ దశ ఎన్నికలకు సంబంధించి ఈసీ విడుదల చేసిన ఓటింగ్ శాతం డేటాలో వ్యత్యాసాలపై కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తున్న అనుమానాలను ప్రధాని మోదీ ఖండించారు.

కాగా మొదటి, రెండో దశ లోక్సభ పోలింగ్కు సంబంధించిన తుది డేటా ప్రకటనలో జాప్యంపై ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రశ్నించారు.

ఈ ఆరోపణలను ఎన్నికల సంఘం కూడా ఖండించింది. ఎలాంటి దుర్వినియోగం జరగలేదని వివరణ ఇచ్చింది.

Related posts