telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు ట్రెండింగ్

ఇంటెలిజెన్స్ హెచ్చరికలు : తిరుమల కొండ .. ఉగ్రమూక టార్గెట్…

TTD gold thefted will be to Tirumala today

ఇటీవల శ్రీలంకలో ఈస్టర్ సందర్భంగా తీవ్రవాదులు సృష్టించిన మారణహోమం భారత్ లో కూడా ప్రకంపనలు రేకెత్తించింది. ఈ నేపథ్యంలో భారత్ లోనూ పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు జారీచేసింది. ఇప్పటికే ఎన్ఐఏ అధీనంలో నలుగురు ఉగ్రవాదులు ఉన్నట్టు తెలుస్తోంది. వారిచ్చిన సమాచారం ఆధారంగా తాజా హెచ్చరికలు జారీచేసింది.

అల్ ఉమా ఉగ్రవాదులు ఏపీలో ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమలలో రెక్కీ నిర్వహించినట్టు ఐబీ సమాచారం అందించింది. కొన్నిరోజుల క్రితమే తిరుమలలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్టు ఐబీ వర్గాలు గుర్తించాయి. దాంతో, తిరుమలలో విజిలెన్స్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. తిరుమలకు వచ్చే అన్ని మార్గాల్లో భారీగా తనిఖీలు చేపట్టారు.

Related posts