telugu navyamedia
రాజకీయ

కరుడు గ‌ట్టిన ఉగ్రవాది ఎన్‌కౌంట‌ర్‌..!

జమ్మూ కశ్మీరులో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో భద్రతాబలగాలు కరుగుడట్టిన ఉగ్రవాది అయిన ఇస్మాయిల్ భాయ్ వురపు లంబును ఈరోజు మట్టుబెట్టాయి. ఇండియన్ ఆర్మీ…పుల్వామాలోని నాగ్‌బెరన్-తార్సర్ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో జైషే మహ్మద్ ఉగ్రవాది బందువు లంబూ అని తెలిసింది.

ఇక, లంబూతో పాటు మరో ఉగ్రవాది కూడా మరణించాడని.. అతడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.. ఘటనా స్థలం నుంచి ఏకే-47 రైఫిల్, ఓ ఎం-4 రైఫిల్ స్వాధీనం చేసుకున్నారు. ఇఈడి బాంబుల త‌యారీలో నిపుణుడైన ఇత‌డు. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఆత్మాహుతి దాడి ఘటనలో లంబూదే కీలక పాత్ర పోషించాడట‌. పేలుడు పదార్థాలను స్వయంగా లంబూ తయారు చేసి.. దాడికి స్కెచ్‌ వేసినట్టు చెబుతున్నారు.

లంబూ అసలు పేరు.. అబు సైఫుల్లా. అతడికి అద్నన్ అనే పేరు కూడా ఉంది. స్వస్థలం పాకిస్తాన్‌లోని పంజాబ్. కాగా..సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడిలో 40 మంది జ‌వాన్లు ప్రాణాలు కొల్పోయిన విష‌యం తెలిసిందే.

Related posts