తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్ అయింది.
తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) 2026 ఫిబ్రవరి-మార్చి నెలల్లో జరగబోయే ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ కు సంబంధించిన టైమ్ టేబుల్, పరీక్ష ఫీజు గడువు తేదీలను విడుదల చేసింది. పరీక్షలు రెండు దశల్లో జరుగుతాయి
ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. ఈ పరీక్షలు ఫిబ్రవరి 21వ తేదీ నాటికి పూర్తవుతాయి.
జనవరి 21వ తేదీన ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష ఉంటుంది. జనవరి 23వ తేదీన ఎథిక్స్ అండ్ హ్యుమన్ వాల్యూస్, జనవరి 24వ తేదీన ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష నిర్వహిస్తారు.
నవంబర్ 1వ తేదీ నుంచి విద్యార్థులు ఫీజులు చెల్లించుకోవచ్చు. ఇందుకు నవంబర్ 14వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ షెడ్యూల్
25- 02 -2026 : పార్ట్ 1 (సెకండ్ లాంగ్వేజ్-1)
27- 02 -2026 : పార్ట్ 2 – ఇంగ్లీష్ పేపర్-1
02- 03 -2026 : మ్యాథ్స్ 1ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్
05- 03 -2026 : మ్యాథ్య్ పేపర్ 1బీ, జువాలజీ, హిస్టరీ-1
09- 03 -2026 : ఫిజిక్స్, ఎకానమిక్స్-1
12- 03 -2026 : కెమిస్ట్రీ, కామర్స్
17- 03 -2026 : మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జియోగ్రఫ్రీ-1
ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ షెడ్యూల్
26- 02 -2026 : పార్ట్ 2 (సెకండ్ లాంగ్వేజ్-2)
28- 02 -2026 : పార్ట్ 1-ఇంగ్లీష్ పేపర్ -2
03- 03 -2026 : మ్యాథ్స్ 2ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్-2
06- 03 -2026 : మ్యాథ్య్ పేపర్ 2బీ, జువాలజీ, హిస్టరీ-2
10- 03 -2026 : ఫిజిక్స్, ఎకానమిక్స్-2
13- 03 -2026 : కెమిస్ట్రీ, కామర్స్-2
16-03-2026: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్-2
18- 03 -2026 : మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫ్రీ-1


