telugu navyamedia
తెలంగాణ వార్తలు

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన..

ముఖ్యమంత్రి కెసిఆర్ గారి అధ్యక్షతన సో మవారం ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ లో ప్రభుత్వ ఉచిత విద్యా బలోపేతానికి తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

విద్యయరంగం పై ..

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం కొత్త చట్టాన్ని తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది. గ్రామాల్లో ఆంగ్లమాధ్యమానికి డిమాండ్ పెరుగుతున్నందున ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అనివార్యత పెరిగిందని మంత్రివర్గం అభిప్రాయపడింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ బడుల్లో ఆంగ్లమాధ్యమంలో విద్యాబోధన చేపట్టాలని అందుకోసం అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని నిర్ణయించింది. విద్యార్థులను ప్రాథమిక స్థాయిలో ఆంగ్లమాధ్యమంలో బోధన కోసం ఉపాధ్యాయులకు శిక్షణ, ఆకర్షణీయంగా విద్యాలయాలు తీర్చిదిద్దడం, క్రీడామైదానాలు, తదితర వసతుల ఏర్పాటు తదితరాలపై కార్యాచరణ చేపట్టాలని మంత్రివర్గ నిర్ణయించింది. ప్రైవేట్, కార్పోరేట్ విద్యకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని విద్యాశాఖను ఆదేశించింది.

TS Education: Another key decision of the Telangana government to  strengthen free education .. Free books for students, uniforms! | Telangana  cabinet approves budget for new scheme to govt schools infrastructures  cabinet |

 ‘మన ఊరు – మన బడి’ ప్రణా ళిక 

ప్రభుత్వ విద్యకు మరింత ప్రాముఖ్యత ఇవ్వడంలో భాగంగా ప్రవేశపెట్టిన ‘మన ఊరు – మన బడి’ కి పథకం కింద పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన, మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం రూ. 7,289 కోట్లతో రూపొందిస్తున్న ప్రణాళిక కోసం తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది.

మరోవైపు ప్రైవేట్ స్కూల్లు, జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీల్లో ఫీజుల నియంత్రణ, ఈ రెండు అంశాల పై పూర్తి అధ్యయనం చేసి సంబంధిత విధి విధానాలను రూపొందించేందుకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది.

ఈ కమిటీలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షురాలిగా.. మంత్రులు కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస యాదవ్, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి , పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు, కేటిఆర్ లు ఈ సబ్ కమిటీలో సభ్యులుగా ఉంటారు.  రానున్న శాసన సభా సమావేశాల్లో దీనికి సంబంధించిన నూతన చట్టాన్ని తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది.

తెలంగాణ రాష్ట్రంలో మహిళా యూనివర్సిటీ ఏర్పాటు కోసం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తదుపరి కేబినెట్ సమావేశానికి పూర్తిస్థాయిలో ప్రతిపాదనలు సిద్ధం చేసుకుని రావాలని సీఎస్​ను ఆదేశించింది.

అటవీ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వచ్చే కేబినేట్ సమావేశానికి పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేసుకొని రావాలని అటవీశాఖ అధికారులను ఆదేశించింది.

సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాల, పరిశోధనా సంస్థలో నాలుగేళ్ల బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సు చదివిన విద్యార్థులకు అటవీశాఖ ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్లు కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది. డైరెక్ట్ రిక్రూట్ మెంట్ కోటా కింద పలు విభాగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ విభాగంలోని ఉద్యోగాల్లో 25శాతం, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విభాగానికి 50 శాతం, ఫారెస్టర్స్ విభాగానికి చెందిన ఉద్యోగాల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు.

అలాగే ..ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రతి సంవత్సరం రెండు జతల స్కూలు యూనిఫామ్స్‌తో పాటు, పుస్తకాలు , ఉచితంగా ఇస్తున్న ప్రభుత్వం తాజాగా వారికి బ్యాగ్‌లు , షూస్ కూడా ఇవ్వాలని బావిస్తోంది. రెండు జతల షూస్‌తో పాటు సాక్స్ కూడా ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కాగా ఈ పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20 లక్షల విద్యార్థుల కోసం 40 కోట్ల రూపాయలు ఖర్చు కానున్నట్టు అంచనా వేస్తున్నారు.

Related posts