*ఇది బడుగుల జీవితాలు మార్చే బడ్జెట్
*ఇది ముమ్మాటికీ కేసీఆర్ మార్క్ బడ్జెట్..
*రాష్ట్రం పట్ల కేంద్రంచిన్న చూపు చూస్తోంది..
*మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు నిధులు అడిగినా ఇవ్వలేదు..
*విభజన హామీలు అమలు చేయట్లేదు
*నీతి ఆయోగ్ సిఫార్సులు పట్టించుకోలేదు..
*యాదాద్రి తరహాలో పుణ్యక్షేత్రాల అభివృద్ధి
తెలంగాణ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హరీష్‌రావు, సోమవారం అసెంబ్లీలోప్రారంభం అయ్యాయి. గవర్నర్ ప్రసంగం లేకుండా నేరుగా బడ్జెట్‌ను అసెంబ్లీలో హరీశ్ రావు ప్రవేశపెట్టారు .
బడ్జెట్ ప్రసంగంలో భాగంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..తెలంగాణ దేశంలో అగ్రగామిగా రూపుదాల్చిందని మంత్రి తెలిపారు. ప్రజలు కేసీఆర్ నాయకత్వం పట్ల మక్కువ చూపుతున్నారు. గతంలో తెలంగాణ ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారు. రాజకీయ, సామాజిక అసమానతల నుంచి స్వరాష్ట్రంగా అవతరించిందని అన్నారు. అవమాన చరిత్ర నుంచి ఆత్మగౌరవం దిశగా తెలంగాణ దూసుకుపోతుందని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులకు 24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా కేంద్రం 24 పైసలు కూడా ఇవ్వలేదు. విభజన చట్టంలో పేర్కొన్న ఏ హామీలూ నెరవేర్చలేదని మంత్రి హరీష్ రావు దుయ్యబట్టారు.
పార్లమెంటులో తెలంగాణ గురించి చర్చకు వచ్చిన ప్రతిసారి తల్లిని చంపి బిడ్డను బతికించారని ప్రస్తుత పాలకులు అంటున్నారు. ఏ విషయంలోనూ కేంద్రం సహకారం లేదు. తెలంగాణకు రావాల్సిన ఐటీఆర్ భారీ ప్రాజెక్టును తప్పించి కేంద్రం భారీ తప్పు చేసింది. కేంద్ర సర్కారుకు ఎన్ని ప్రతిపాదనలు పంపినా, విన్నవించుకున్నా సహకారం లేదన్నారు ఆర్థిక మంత్రి హరీష్ రావు.
తెలంగాణ దేశంలో అగ్రగామిగా రూపుదాల్చిందని మంత్రి తెలిపారు. పారదర్శక విధానాలతో రాబడిని పెంచుకున్నామన్నారు. సమైక్యరాష్ట్రంలో తెలంగాణ అగచాట్లు పడిందని గుర్తుచేశారు. పోరాటం దశ నుంచి ఆవిర్భావం వరకూ తెలంగాణ కొత్తరూపం సంతరించుకుందని తెలిపారు. సవాళ్లు, క్లిష్టమమైన సమస్యలను అధిగమించామని చెప్పారు. పరిపాలనలో టీఆర్‌ఎస్ రాజీలేని వైఖరిని అవలంభించిందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అవలంభిస్తున్న… దార్శనికత, అవినీతి రహిత పరిపాలన, పటిష్ఠమైన ఆర్థిక విధానాలతో తెలంగాణ బలీయమైన ఆర్థికశక్తిగా ఎదిగిందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. 2022-23 బడ్జెట్ బడుగుల జీవితాలను మార్చే వార్షిక పద్దు అని… కేసీఆర్ మార్క్ బడ్జెట్ అని హరీశ్‌రావు అన్నారు.


నందమూరి తారక రామారావు ఒక సంచలనం.. ప్రభంజనం..