telugu navyamedia
రాజకీయ వార్తలు

టీచర్లు బీజేపీకి మద్దతిస్తున్నారు: ఈటల రాజేందర్

బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఈరోజు ఆ పార్టీ ఉపాధ్యాయ నియోజకవర్గ అభ్యర్థి నరోత్తమ్‌ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ఉపాధ్యాయులు బీజేపీకి అండగా నిలుస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి ఎన్నికల వాగ్దానాలు ఏమయ్యాయి  పీఆర్సీ ఏమైంది.

డీఏ, ఇంక్రిమెంట్లు ఏమయ్యాయి  సీపీఎస్ విధానంపై ఏం నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు.

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాబోతోందని రాజేందర్ అన్నారు.సీఎం రేవంత్ రెడ్డికి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదని, ఓట్ల కోసం సీఎం డ్రామాలు చేస్తున్నారని అన్నారు. బీసీ, ఎస్టీలను కాంగ్రెస్ ప్రభుత్వమే ముఖ్యమంత్రిని చేయగలదు.

బీసీల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదని, ఓటు వేసే ముందు ప్రజలు ఆలోచించాలని, మనమెవరో చూసి ఓటేయాలని, ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తికి ఓటు వేయాలని రాజేందర్ అన్నారు.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ప్రచారానికి ఉపాధ్యాయుల నుంచి మంచి స్పందన వస్తోందని రాజేందర్ అన్నారు.

బీజేపీ పాలనలో దేశం సుభిక్షంగా ఉందని, అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో పయనిస్తోందని పేర్కొన్నారు. టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి ఓటేస్తామని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఉపాధ్యాయులకు అండగా ఉంటాం’’ అని తెలిపారు.

బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధంగా లేదని అన్నారు.

హైడ్రా, మూసీ నది ప్రక్షాళన, లగచర్ల భూములు ఇలా ప్రతి విషయంలోనూ రేవంత్ ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేసిందన్నారు.

Related posts