ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందిపడుతుంటే, చంద్రబాబు నివాసం చుట్టూ మంత్రులు చక్కర్లు కొడుతున్నారని ధ్వజమెత్తారు. సీఎం జగన్ కు పిచ్చి పట్టిందని ఎద్దేవాచేశారు. వరదలపై కేంద్రం, సీడబ్యూసీ హెచ్చరించినా పట్టించుకోలేదని విమర్శలు గుప్పించారు.
అప్పుడు గోదావరి నదికి వరదలు వచ్చినప్పుడు జెరూసలేంకు వెళ్లారని దుయ్యబట్టారు. ఇప్పుడు కృష్ణా నదికి వరదలు వస్తే అమెరికా విహారయాత్రకు జగన్ వెళ్లారని విమర్శించారు. చంద్రబాబును ఇబ్బందిపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. వరదల వల్ల పంటలు సర్వనాశనమయ్యాయని అన్నారు.
ఎన్నికల్లో పోత్తులపై పవన్ తో చర్చలు: కేఏ పాల్