telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“త్రిష వీడియో బయటపెడతా…” హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

Meeraa-Mithun

తమిళ సినీ పరిశ్రమలో చెన్నై చంద్రంగా పిలుచుకునే త్రిష, మరో నటి మీరా మిథున్ ల మధ్య వైరం చాలాకాలం నుంచి సాగుతోంది. అవకాశం దొరికినప్పుడల్లా త్రిషపై మీరా విరుచుకు పడుతుంటుంది. తాజాగా త్రిషను ఉద్దేశించి మీరా సంచలన వ్యాఖ్యలు చేసింది. “ఐదున్నర అడుగుల ఎత్తున్న మిస్ చెన్నై త్రిష… చిన్నచిన్న రోల్స్, సైడ్ రోల్స్ చేసి మెయిన్ స్ట్రీమ్ లోకి ఎంటర్ అయింది. ఆ తర్వాత కింగ్ ఫిషర్ మోడల్ అయింది. అభద్రతా భావంతో ఆమె కోలీవుడ్ మాఫియాతో చేతులు కలిపింది. ‘ఎన్నై అరిందల్’ చిత్రం నుంచి నన్ను తప్పించింది. ఈ సినిమా నుంచి నన్ను తొలగించడంతోనే త్రిష పనులు ఆగిపోలేదు. ‘పెట్ట’ సినిమా నుంచి కూడా నన్ను తప్పించింది. త్రిషకు సంబంధించిన వీడియోను బయటపెడతా” అని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది మీరా. ఇక మీరా మిథున్ తమిళ బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొంది.

Related posts