ప్రస్తుతం అనీల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. “సరిలేరు నీకెవ్వరు” చిత్రంలో మహేష్ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో కనిపించనున్నారు. బండ్ల గణేష్, విజయశాంతితో పాటు పలువురు సినీ నటులు చిత్రంలో నటిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుంది. అయితే మహేష్ బాబు తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరులోను తమన్నా స్పెషల్ డ్యాన్స్ చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ ఇప్పటికే ఆ సాంగ్‌కి సంబంధించిన ప్రత్యేక ట్యూన్స్ రెడీ చేస్తుండగా, త్వరలోనే ఆ పాటని షూట్ చేయనున్నారట. స్టార్ హీరోయిన్ స్పెషల్ సాంగ్స్ చేయాలంటే కాస్త గట్స్ ఉండాలి. ఒక్కసారి స్పెషల్ సాంగ్స్ చేయడం మొదలు పెడితే హీరోయిన్‌గా ఆఫర్స్ రావడం కాస్త కష్టతరమనే చెప్పవచ్చు. అవేమి పట్టించుకోని తమన్నా, కాజల్‌లు అప్పుడప్పుడు స్టార్ హీరో మూవీస్‌లో స్పెషల్ సాంగ్స్‌తో అలరిస్తున్నారు. తమన్నా ఇప్పటికే అల్లుడు శీను, స్పీడున్నోడు, జాగ్వార్, జై లవకుశ, కేజీఎఫ్ చాప్టర్1 వంటి చిత్రాలలో ప్రత్యేక గీతాలతో అలరించింది. మొత్తానికి కథానాయికగా, ఐటెం భామగా తమన్నా అదరగొడుతుంది. తమన్నా నటించిన “దటీజ్ మహాలక్ష్మీ” చిత్రం త్వరలోనే విడుదల కానుంది.
previous post
next post
సమంత ‘కమ్ బ్యాక్.. బిగ్గర్.. స్ట్రాంగర్..’