తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేడు తొలిసారిగా ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆ పార్టీ ముఖ్యనేతలు కాంగ్రెస్ అధిష్ఠానం పిలుపు మేరకు ఈ ఉదయం 11 గంటల తర్వాత వీరంతా పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో సమావేశం కానున్నారు.
రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్కతో పాటు 17 మంది ఎమ్మెల్యేలు, పీసీసీ కోశాధికారి, ఇతర నేతలు ఢిల్లీ వెళ్లనున్నారు. భేటీ సందర్భంగా తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు.
ఇక చంద్రబాబు కుంభకోణాలన్ని వెలుగులోకి వస్తాయి: విజయసాయి