telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఐపీఎల్ 2021 : బట్లర్ సెంచరీ… హైదరాబాద్ టార్గెట్…?

ఐపీఎల్ లో ఈరోజు వీకెండ్ సందర్బంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మొదటి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ మొదట బ్యాటింగ్ చేసింది. కానీ ఆ జట్టు ఓపెనర్ యషస్వి జైస్వాల్(12) త్వరగా నిరాశపరిచిన తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన కెప్టెన్ సంజు సామ్సన్ తో కలిసి మరి ఓపెనర్ జోస్ బట్లర్ రెండో వికెట్ కు 150 పరుగుల భాగసౌమ్యని నెలకొల్పాడు. ఈ క్రమంలో సంజు(48) ఔట్ అయిన బట్లర్ తన బాదుడు కొనసాగిస్తూ సెంచరీ పూర్తి చేసుకొని 124 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద 19వ ఓవర్ చివరి బంతికి వెనుదిరిగాడు. అప్పటికే 209 పరుగులు చేసిన రాజస్థాన్ చివరి ఓవర్ లో మరో 11 పరుగులు చేసి 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 220 పరుగులు సాధించింది. ఇక సన్‌రైజర్స్ బౌలర్లలో విజయ్ శంకర్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు. అయితే ఈ మ్యాచ్ లో గెలవాలంటే హైదరాబాద్ 221 పరుగులు చేయాలి. మరి 150 లక్ష్యానికే తడబడే హైదరాబాద్ ఇప్పుడు ఏం చేస్తుంది అనేది చూడాలి.

Related posts