ఐపీఎల్ 2024 సీజన్ ప్లే ఆఫ్స్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ అర్హత సాధించింది. గుజరాత్ టైటాన్స్‌తో ఉప్పల్ వేదికగా గురువారం జరగాల్సిన మ్యాచ్.. వర్షం కారణంగా బంతి పడకుండానే రద్దయ్యింది.
దాంతో అంపైర్లు ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. దాంతో 15 పాయింట్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను దక్కించుకుంది.
పంజాబ్ కింగ్స్‌తో ఆదివారం జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ విజయం సాధిస్తే టాప్-2లో నిలిచే అవకాశం ఉంది.
అయితే కేకేఆర్ చేతిలో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోవాల్సి ఉంటుంది. ఒకవేళ పంజాబ్ చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడినా ప్లే ఆఫ్స్ చేరుతోంది.
సన్‌రైజర్స్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ రద్దవ్వడంతో ఆర్‌సీబీ, సీఎస్‌కే డేంజర్ జోన్‌లో నిలిచాయి.
ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి.
శనివారం బెంగళూరు వేదికగా జరిగే మ్యాచ్.. ఆర్‌సీబీ, సీఎస్‌కేకు నాకౌట్‌లాంటిది.
ప్లే ఆఫ్స్ చేరాలంటే ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 18 పరుగుల తేడాతో గెలవాలి. లేదా 18.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించాలి.
అప్పుడే సీఎస్‌కే కంటే మెరుగైన రన్ రేట్ సాధిస్తోంది. సీఎస్‌కే ప్లే ఆఫ్స్ చేరాలంటే ఆర్‌సీబీని ఓడించాలి. లేదా తక్కువ మార్జిన్‌తో ఓడిపోవాలి.
అయితే ఈ మ్యాచ్‌కు కూడా వర్ష సూచన ఉండటం ఆర్‌సీబీ అభిమానులను కలవరపెడుతోంది.