‘ప్రేమ కథ చిత్రం’ వంటి మంచి హిట్ సినిమాలలో ప్రేక్షకులను అలరించిన హీరో సుధీర్ బాబు నటించిన ‘శ్రీదేవి సోడా సెంటర్’ మూవీ రిలీజ్ కు రెడీ అయ్యింది. ఇందులో సుధీర్ బాబుకు జోడీగా ఆనంది నటించింది. ‘పలాస’ సినిమాకు దర్శకత్వం వహించిన కరుణ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మనసుకు హత్తుకునే ప్రేమకథతో ఈచిత్రా న్ని తెరకెక్కించారు.
అలాగే తన స్నేహితుడు, హీరో సుధీర్ బాబు చిత్రం కోసం తాజాగా ప్రమోషన్ లో పాలుపంచుకున్నాడు. సుధీర్ బాబు తాను మంచి స్నేహితులమని.. సినిమా తొలినాళ్లలో కలిసి తిరిగేవాళ్లమని గుర్తు చేసుకున్నాడు.
‘శ్రీదేవి సోడా సెంటర్’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా సుధీర్ ట్విటర్ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. ఇందులో భాగంగా ‘ప్రభాస్ అన్నతో మీకున్న అనుబంధం, మీ ఇద్దరి మధ్య చోటుచేసుకున్న మధుర జ్ఞాపకాలను మాతో షేర్ చేసుకోండి..’ అని ఓ నెటిజన్ అడగ్గా.. ‘‘ప్రభాస్ నాకు ఆప్తమిత్రుడు. ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది. మా ఇద్దరి మధ్య ఎన్నో మధుర జ్ఞాపకాలున్నాయి.
‘వర్షం’ సినిమా విడుదలయ్యాక ఆ సినిమా కటౌట్ చూడడం కోసం నేను, ప్రభాస్, దేవిశ్రీప్రసాద్ అర్ధరాత్రి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని థియేటర్ల వద్దకు వెళ్లాం. ఆ తర్వాత ట్యాంక్‌బండ్‌కు చేరుకుని.. రాత్రంతా ‘వర్షం’ పాటలు పాడుకుంటూ అక్కడే గడిపేశాం’’ అంటూ సుధీర్ ఆనాటి జ్ఞాపకాన్ని గుర్తుచేసుకున్నారు.
అనంతరం మరో నెటిజన్.. ‘కెరీర్ ఆరంభించిన కొత్తలో మిమ్మల్ని ఎవరైనా విమర్శించారా? పరాజయాల నుంచి మీరు ఎలా విజయం సాధించగలిగారు?’ అని ప్రశ్నించగా.. ‘ఒకవేళ ఎదుటివ్యక్తి చేసిన విమర్శ నిజమనిపిస్తే దానిపై వర్క్ చేసి.. నన్ను నేను రీబిల్డ్ చేసుకుంటాను’ అని ఆయన సమాధానమిచ్చారు. అంతేకాకుండా మణిశర్మ-మహేశ్ కాంబోలో వచ్చిన ‘ఖలేజా, పోకిరి’ తనకిష్టమైన ఆల్బమ్స్ అని వివరించారు.
ఎన్టీఆర్ తో ఎఫైర్… అందుకే సినిమాలకు దూరం : సమీరా రెడ్డి