telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎన్టీఆర్‌ సినిమాలో ఉపేంద్ర..?

అరవింద సమేతా సినిమాతో ఈ కాంబో బ్లాక్ బస్టర్  అందుకున్నారు ఎన్టీఆర్, త్రివిక్రమ్. అయితే.. మళ్లీ ఈ కాంబో కోసం సినీ ప్రియులు అందరూ ఎదురు చూస్తున్నారు. వీరి కాంబోలో ఏదో మ్యాచ్ ఉందని మొదటి సినిమాతోనే నిరూపించారు. ఎన్టీఆర్ నటనకు త్రివిక్రమ్ డైలాగ్‌లు జోడి అయితే ఆ కిక్కే వేరని అభిమానులకు అర్థం అయింది. అందుకేనేమో మళ్లీ ఆ కాంబో కోసం పరితపిస్తున్నారు. కానీ ఎన్‌టీఆర్ తన నూతన సినిమా ఆర్ఆర్ఆర్‌తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయ్యాక త్రివిక్రమ్‌తో సినిమా చేయనున్నాడట. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. దాంతో ఈ సినిమాకు ‘అయినను పోయిరావలే హస్తినకు’ అనే టైటిల్ ఖారారు చేశారు. మాటల మాంత్రికుడు ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనిమీదే ఉన్నాడు. ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ ఈ సినిమా నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ఎన్‌టీఆర్‌కు విలన్‌గా ఎవరు చేయనున్నారనేది ఇంకా తెలియదు. దాంతో ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర విలన్‌ పాత్ర పోషించనున్నట్లు వార్తలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ఇంతకు ముందు త్రివిక్రమ్, బన్నీ కాంబోలో వచ్చిన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో నెగిటివ్ పాత్రకు ఉపేంద్ర తన అద్భుత నటనను జోడించి ప్రాణం పోశాడు. అందుకే ఎన్‌టీఆర్ సినిమాలో కూడా ఉపేంద్ర నెగిట్‌ రోల్ చేస్తాడని సినీ వర్గాలు అంటున్నాయి. దాంతో ఇద్దరు గొప్ప నటులు తలపడితే ఆ పోరు మహాసంగ్రామంలా ఉంటుందని అభిమానులు ఊహిస్తున్నారు. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది.

Related posts