telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అతన్ని తలచుకొని కన్నీరు పెట్టిన అనుష్క

Anushka

‘నిశ్శబ్దం’ త్వరలో విడుదలవుతున్న సందర్భంగా చేపడుతున్న ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటుంది మూవీ టీమ్. తాజాగా సుమ హోస్ట్ చేస్తున్న క్యాష్ ప్రోగ్రామ్‌కు అనుష్క, సుబ్బరాజు, శ్రీనివాస్ అవసరాల, హేమంత్ మధుకర్ తదితరులు అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా సుమ అడిగిన పలు ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలిచ్చింది అనుష్క. AV ప్లే చేయగా దర్శకుడు కోడి రామకృష్ణ ఫోటో చూసి వెక్కి వెక్కి ఏడ్చింది స్వీటి నటిగా 15 ఏళ్ల కెరీర్ పూర్తయిన సందర్భంగా తొలిచిత్రం ‘సూపర్’ షూటింగు టైములో ‘అక్కడబక్కడ భంభేబో’ పాట కోసం రిహార్సల్స్ చేస్తున్నప్పుడు డ్యాన్స్ ఎలా చేయాలో తెలిసేది కాదు. నేను చేయలేనంటూ ఏడ్చేసాను. ‘పది రోజులైనా పర్లేదు.. వచ్చినప్పుడే చేద్దాం’ అంటూ యూనిట్ అంతా సపోర్ట్ చేశారు. నాకు ఫస్ట్ చాన్స్ ఇచ్చిన నాగార్జున, పూరి గార్లకు థ్యాంక్స్. కెరీర్ 15 ఇయర్స్ పూర్తయింది.. ఈ సమయంలో లేకపోవడం బాధాకరం. ఆయన ఎక్కడున్నా మాతోనే ఉంటారు’ అంటూ కన్నీటి పర్యంతమైంది అనుష్క.

Related posts