telugu navyamedia
సినిమా వార్తలు

మ‌మ్మ‌ల్ని నెగ్గించడం కోసమే మెగాస్టార్ తగ్గారు- రాజమౌళి ప్రశంసలు..

రామ్‌చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌లిసిన‌టించిన చిత్రం ఆర్ ఆర్ ఆర్‌. ఈ చిత్రంలో కొమరం భీం పాత్రలో, రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా మార్చి 25 న విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే శనివారం చిక్‌బళ్లాపూర్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వ‌హించారు. ఈ కార్యక్రమానికి కన్నడ స్టార్​ హీరో శివరాజ్​ కుమార్​, సీఎం బసవరాజ్‌ బొమ్మై ముఖ్య అతిథిగా విచ్చేశారు.

కర్ణాటకలోని చిక్‌బళ్లాపుర్‌ వేదికగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దర్శకధీరుడు రాజమౌళి మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవిపై ప్రశంసల జల్లు కురింపించారు .. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు థ్యాంక్స్‌ చెప్పారు జక్కన్న .టికెట్ల ధరల పెంపు కోసం కృషిచేసిన మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక కృజ్ఞతలు. ఏపీ సీఎంతో పలుమార్లు భేటీ అయ్యి, టికెట్ల ధరల పెంపునకు చిరంజీవి ఎంతో కృషి చేశారు.

తెలుగు సినీ పరిశ్రమ చిరంజీవికి రుణపడి ఉండాలి. సిని ప్రరిశ్రమ వాళ్లని నెగ్గించడానికి చిరంజీవి తగ్గి, ఎన్నో మాటలు పడ్డారు. నిజంగా చిరంజీవి ఇండస్ట్రీ పెద్ద అని అభివర్ణించారు. ఆయనకు ఇండస్ట్రీ పెద్ద అనే కంటే ఇండస్ట్రీ బిడ్డ అనిపించుకోవడమే ఇష్టంగా ఉంటుందన్నారు. ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా, చిరంజీవి ట్రూ మెగాస్టార్ అంటూ చెప్పుకొచ్చారు.. టికెట్ల ధరలను పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు జక్కన్న.

అంతేకాదు తెలంగాణలో అదనపు షోలు, టిక్కెట్ల పెంపుదలకు కూడా చిరంజీవే కారణమని, ఆయనే తెరవెనుక ఉండి అంతా నడిపించారని అన్నారు

ఇక తనకు ఫ్యామిలీ మెంబర్స్ కంటే తన అసిస్టెంట్ డైరెక్టర్‌లే ఎక్కువ అని రాజమౌళి స్పష్టం చేశాడు. వాళ్లు లేకుంటే నేను ఈ చిత్రం ఇంత బాగా చేయలేనన్నాడు. ఈ వేదికపై వారికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశాడు. ఇదిలా ఉంటే త్వరలోనే మరో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కూడా ఉందన్నారు.

అయితే అందులో హీరోల కంటే ముందే అసిస్టెంట్ డైరెక్టర్లు నటించి చూపిస్తారన్నారు. ఇక ఈ ‘ఆర్ఆర్ఆర్’ విడుదలయ్యాక ఆ సినిమా విడుదల చేస్తామన్నాడు. అయితే అసిస్టెంట్ డైరెక్టర్లు నటించిన ‘ఆర్ఆర్ఆర్’కు మించిన కామెడీ సినిమా ఉండదు అని జక్కన్న తెలిపాడు.

Related posts