ఎన్నో ఆశలతో పంపిన రాకెట్ పేలిపోవడంతో స్పేస్ ఎక్స్ మరో పరాజయాన్ని చవి చూసింది. చంద్రుడు, అంగారకుడు వంటి గ్రహాలపై పరిశోధలు చేసేందకు స్పేస్ ఎక్స్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈప్రైవేటు సంస్థ స్టార్ షిప్ నమూనా రాకెట్ పరిచయం చేసింది. దాన్ని ఇటీవల ప్రయేగించింది. ఈ ప్రయోగం అమెరికా టెక్సాన్ తీరంలో జరిగింది. ఈ ప్రయేగంలో స్టార్ షిప్ నమూనా భూమిపై ల్యాండ్ అయ్యే సమయంలో కూప్పకూలింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఈ సంస్థ తన ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేసింది. ఇదిలా ఉంటే అసలు ఈ ప్రయేగం ఏంటని చాలా మందికి తెలియదు. అంగారకుడు, చంద్రుడి పైకి మావులు ప్రయాణం చేయగలగాలని అందులో భాగంగా మానవులను, కొంత సామాగ్రిని పంపి తిరిగి తీసుకొచ్చేందుకు ఈ సంస్థ ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగానే స్టార్ షిప్ పేరుపై రాకెట్‌లను తయారు చేస్తోంది. ఈ ప్రయేగాలు ఎంతో ఖర్చుతో కూడుకున్నవి అందుకనే ముందుగా నమూనా రాకెట్‌లను ప్రయోగిస్తారు. అలా చేసిన ప్రయేగమే ఇది. అయితే ఈ ప్రయోగం విఫలమయినందుకు ఏమాత్రం బాధ లేదని, కావలసిన విషయాలను తెలుసుకున్నామని సంస్థ అధినేత అలాన్ మస్క్ తెలిపారు. మరోసారైనా ఈ ప్రయోగంలో స్పేస్ ఎక్స్ విజయం సాధిస్తుందా… లేదా అనేది చూడాలి మరి.
previous post
next post
తన జీవితం ప్రజలకే అంకితం: కవిత