ప్రముఖ టీవీ షోలు “ఇండియాస్ గాట్ టాలెంట్ -7”, “మాస్టర్ ఛెఫ్ ఇండియా”లకు చెందిన సీనియర్ పోస్ట్ ప్రొడ్యూసర్ సోహన్ చౌహాన్ మృతదేహం ఒక చెరువులో లభ్యం కావడం బాలీవుడ్ లో కలకలం సృష్టిస్తోంది. సోహన్ మృతదేహం ముంబైలోని రాయల్ పామ్స్ సొసైటీకి చెందిన ఒక చెరువులో లభ్యమైంది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. బిల్డింగ్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌లో సోహన్ బాటిల్ తీసుకుని బయటకు వెళుతున్న దృశ్యం కనిపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో సోహన్ శరీరంపై ఎటువంటి గాయాలు లేవని తేలింది. సోహన్ మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సోహన్ జూన్ 13 వరకూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నారు. “సారేగామాపా” కార్యక్రమం గురించి జూన్ 9 ఒక పోస్టు చేశారు. సోహన్‌కు ఆరు నెలల క్రితమే వివాహం కాగా… భార్య ఢిల్లీలో, ఆయన ఒంటరిగా ముంబైలో ఉంటున్నారు. సోహన్‌ను చివరిసారిగా ఆయన మెయిడ్ చూసినట్లు తెలుస్తోంది. సోహాన్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
							previous post
						
						
					
							next post
						
						
					


కరోనా వ్యాక్సిన్ పై మోడీ కీలక వ్యాఖ్యలు…