రెండ్రోజుల క్రితం సోషల్ మీడియాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలపై వివాదాస్పద బాలీవుడ్ నటి, మోడల్ సోఫియా హయత్ చేసిన ట్వీట్లు వైరల్ గా మారగా… ఆ ట్వీట్లపై సోఫియా మాట్లాడుతూ టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మతో మాత్రం కొన్ని రోజులు రిలేషన్షిప్ లో ఉన్నానని, ఆ తరువాత విభేదాల కారణంగా విడిపోయామని, ప్రస్తుతం తమతమ జీవితాల్లో తాము బిజీగా ఉన్నామని, ఇక విరాట్ తో తనకు ఎలాంటి శారీరక సంబంధం లేదని, సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ట్వీట్లు తాను చేయలేదని స్పష్టం చేసింది.
రోహిత్ తో ప్రేమాయణం గురించి సోఫియా మాట్లాడుతూ తాను క్రికెట్‌ను ఎక్కువగా చూడనని, కాబట్టి రోహిత్ క్రికెటర్ అనే విషయం అతన్ని కలిసే వరకు తనకు తెలియదని పేర్కొంది. తన స్నేహితురాలి ద్వారా రోహిత్‌ను కలిశానని, దీంతో ఇద్దరికీ పరిచయం ఏర్పడిందని, ఆ తర్వాత అది ప్రేమగా మారిందని, 2012లో తాను రోహిత్‌తో డేటింగ్ చేశానని, లండన్‌లోని ఓ క్లబ్‌లో ఇద్దరం ఏకాంతంగా కలిశామని, అప్పుడు రోహిత్ తనను ముద్దుపెట్టుకున్నట్టుగా చెప్పుకొచ్చింది బ్రిటీష్ బ్యూటీ సోఫియా. తమ ప్రేమ వ్యవహారం మీడియాకు తెలియనంత వరకు బాగానే సాగిందని, ఆ తరువాత మీడియాకు ఈ విషయం తెలియడంతో రోహిత్ తనతో రిలేషన్ నుంచి తప్పుకున్నాడని, ఆ తరువాత తాము విడిపోయామని తన బ్రేకప్ గురించి తెలిపింది సోఫియా. త్వరలో తన జీవితంపై ఓ పుస్తకం రాస్తానని, అందులో రోహిత్ తో తనకున్న ఎఫైర్ గురించి కూడా అందులో ప్రస్తావించనున్నట్టు వివరించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.


పంత్ భారత జట్టుకే కెప్టెన్ అవచ్చు : అజహరుద్దీన్