టాలీవుడ్ సింగర్ సునీత వివాహం ప్రముఖ వ్యాపారవేత్త రామ్ వీరపనేనితో శనివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ లోని శంషాబాద్ అమ్మపల్లి దేవాలయం ప్రాంగణంలో వీరి పెళ్లి జరిగింది. ఈ వివాహ వేడుకకు మంత్రి ఎర్రబెల్లితో పాటు పలుగురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అలాగే రామ్ వీరపనేనితో సన్నిహితంగా ఉండే పలువురు రాజకీయ నాయకులు ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. అయితే.. అతి తక్కువ మందితో ఈ వివాహం జరిగింది. ఇక అంతకు ముందు మెహందీ వేడుకలో సునీత స్నేహితురాలు రేణు దేశాయ్, యాంకర్ సుమ కనకాల కూడా సందడి చేశారు. కాగా..ఈ మధ్యే గచ్చిబౌలిలోని ఓ స్టార్ హోటల్లో సునీత-రామ్ల ప్రీ వెడ్డింగ్ పార్టీ జరిగింది. దానికి ముందుగానే ఓ హోటల్లో స్నేహితులకు పార్టీ ఇచ్చారు.
							previous post
						
						
					
							next post
						
						
					


పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లపై ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు