బిగ్ బాస్ తరువాత ఓవియా కోలీవుడ్ లో బాగా పాపులర్ అయ్యింది. తాజాగా ఆమె నటించిన బోల్డ్ కంటెంట్ సినిమా “90 ఎమ్ఎల్”తో మరోసారి ప్రేక్షకుల దృష్టిలో పడింది ఓవియా. ఈ సినిమాకు శింబు సంగీతం అందించడమే కాకుండా ఒక ప్రత్యేకమైన పాత్రలో నటించాడని సమాచారం. అయితే ఇటీవల విడుదలైన ఈ సినిమాలో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉందట. ఇక శింబు కేవలం క్యామియో రోల్ కె పరిమితం కాకుండా ఒవియాతో లిప్ లాక్ సన్నివేశాల్లో నటించి ప్రేక్షకులకు షాకిచ్చాడు. సినిమాలో శింబు ఉంటాడన్న విషయం అందరికీ తెలుసు… కానీ ఇలా ఏకంగా ఒవియాతో లిప్ లాక్ సన్నివేశంతో దర్శనమిస్తాడని ఎవరూ ఊహించకపోవడం గమనార్హం.
ప్రస్తుతం వీరిద్దరి లిప్ లాక్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటికే వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందంటూ పుకార్లు రాగా… ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఒవియా తనకు శింబు అంటే ఇష్టమని, శింబు లాంటి స్నేహితునితో జీవితాంతం ఉండాలని కోరుకుంటానని, ప్రేమ ఎప్పుడు, ఎక్కడ, ఎలా పుడుతుందో ఎవరికీ తెలియదంటూ సినిమా రేంజ్ లో డైలాగ్ చెప్పేసింది.
படத்துக்கு மியூசிக் போட வந்த வேல முடிஞ்சது #90ml #Oviya #Simbu pic.twitter.com/xtyD3P46mr
— Mersal sivaRasikanda (@siva17594) 1 March 2019