telugu navyamedia
సినిమా వార్తలు

13 ఏళ్ళ తరువాత రీఎంట్రీ ఇస్తున్న శిల్పాశెట్టి

Shilpa-shetty

తెలుగులో స్టార్ హీరోల‌తో న‌టించిన బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి తన అభినయంతో, అందచందాలతో ప్రేక్షకులను అలరించింది. ప్ర‌ముఖ బిజినెస్ మెన్ రాజ్ కుంద్రాని నవంబర్ 22,2009న వివాహం చేసుకున్న ఈ అమ్మ‌డు… పెళ్లి త‌ర్వాత సినిమాల‌కి పూర్తి దూర‌మైంది. ఇంటి ప‌నుల‌తో బిజీగా ఉంటూనే త‌న కుమారుడు వియాన్ బాగోగులు చూసుకుంటూ కాలం గడుపుతూ వ‌చ్చింది. అయితే ప‌ద‌మూడేళ్ళుగా వెండితెర‌కి దూరంగా ఉన్న శిల్పా త్వ‌ర‌లో రీ ఎంట్రీ ఇవ్వ‌నుంద‌ని ఓ వార్త పత్రిక క‌థ‌నం ప్రచురించింది. ఈ విషయాన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ “ఇది నిజం. 13 ఏళ్ళ విరామానికి ఇక ముగింపు ప‌లుకుతున్నా. త్వ‌ర‌లో నిక‌మ్మ అనే సినిమాతో మీ ముందుకు వ‌స్తున్నాను. అభిమన్యు, షిర్లేసేతియా వంటి అద్భుతమైన, ప్రతిభావంతులైన నటులతో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం ఆనందంగా ఉంది. మీ ఆశీర్వాదాలు కావాలి. ఇన్నేళ్లుగా నాపై ప్రేమ కురిపిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు” అంటూ శిల్పాశెట్టి రీ ఎంట్రీ పై ఓ క్లారిటీ ఇచ్చింది. “నికమ్మ” అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమాకు షబ్బీర్‌ ఖాన్‌ దర్శకత్వంలో రూపొందుతుంది.

Related posts