telugu navyamedia
సినిమా వార్తలు

విద్యాబాలన్ కుమార్తె పాత్రలో “దంగల్” బ్యూటీ

Vidyabalan

బాలీవుడ్ నటి విద్యాబాలన్ మ్యాథ్స్ జీనియ‌స్ శంకుతల దేవి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న చిత్రంలో ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది. లేడీ డైరెక్టర్ అను మీనన్ తెరకెక్కించనున్న ఈచిత్రాన్ని విక్రమ్ మల్హోత్రా నిర్మించనున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల కానుంది. తాజాగా చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. ఇందులో విద్యా లుక్ ఆక‌ట్టుకునేలా ఉంది. “శ‌కుంత‌ల దేవి” ఓ హ్యూమ‌న్ కంప్యూట‌ర్. ఐదు సంవ‌త్స‌రాల వ‌యస్సులో 18 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు ఉన్న విద్యార్ధుల మ్యాథ్స్ ప్రాబ్ల‌మ్స్‌ని సులువుగా సాల్వ్ చేసింది. శ‌కుంత‌ల దేవి పాత్ర‌లో న‌టించ‌డం చాలా అదృష్టంగా భావిస్తున్న‌ట్టు విద్యా చెప్పుకొచ్చింది. ఈ మూవీలో విద్యాబాలన్ కూతురి పాత్రలో సన్యామల్హోత్రా నటిస్తోంది. ఈ సినిమాలో శకుంతాలాదేవి కూతురి (అనుపమ బెనర్జీ)పాత్రలో నటిస్తున్నందుకు చాలా ఎక్సయిటింగ్‌గా ఉందని సన్యా ఇన్ స్టాగ్రామ్ లో కామెంట్ తో ఓ వీడియో పోస్ట్ చేసింది. “దంగల్” సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సన్యా మల్హోత్రా. ఈ హీరోయిన్ తక్కువ సమయంలోనే దంగల్, బాద్ షాహో వంటి ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటించి అందరిని మెప్పించింది. తాజాగా అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది సన్యా.

Related posts